twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్‌కు ముందే దుమ్మురేపుతున్న సల్మాన్ పాట.. ఐదు ట్రాక్‌లలో సాంగ్..

    బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటుడే కాదు.. మంచి ఫైటర్ కూడా. అంతేకాకుండా మంచి గాయకుడు కూడా. గతంలో సల్మాన్ పాడిన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకొన్నాయి.

    By Rajababu
    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటుడే కాదు.. మంచి ఫైటర్ కూడా. అంతేకాకుండా మంచి గాయకుడు కూడా. గతంలో సల్మాన్ పాడిన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకొన్నాయి. పాటలను ప్రొఫెషనల్‌గా పాడారని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. 2015లో 'మై హూ హీరో తేరా' అనే పాట యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొన్నది. తాజాగా మరాఠీ చిత్రం కోసం సల్మాన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

    మహేశ్ మంజ్రేకర్ కోసం..

    మహేశ్ మంజ్రేకర్ కోసం..

    ట్యూబ్‌లైట్ చిత్ర షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ తాజాగా మరోసారి తన గళాన్ని సవరించుకొన్నాడు. తన స్నేహితుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ చిత్రం రూపొందిస్తున్న ఫ్రెండ్‌షిప్ అన్‌లిమిటెడ్ (ఎఫ్‌యూ) చిత్రం కోసం సల్మాన్ చేత మహేశ్ ఈ పాటను పాడించాడు. ఈ చిత్రానికి విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్నాడు.

    విశాల్ మిశ్రా ప్రశంస..

    విశాల్ మిశ్రా ప్రశంస..

    సల్మాన్ పాట పాడటంపై విశాల్ మిశ్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట రికార్డు ఐదు ట్రాక్స్ పాడారు. ఈ ట్రాక్స్‌ను కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి చేయడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. సంగీతం గురించి కొత్త విషయాన్ని సల్మాన్ అర్ధం చేసుకొనే తీరు అద్భుతం అని విశాల్ అన్నారు. గచీ పాటను కొన్నిసార్లు మాత్రమే విని చాలా తొందరగా పాటపాడారు అని పేర్కొన్నాడు.

    కొత్త టెక్నాలజీతో ..

    కొత్త టెక్నాలజీతో ..

    ఈ చిత్రంలో అన్ని పాటలను రికార్డు చేయడానికి ఆటో ట్యూనర్ విధానాన్ని పాటించాం. దీంతో పాటకు సంబంధించిన క్వాలిటీ బాగా ఉంటుంది. ఎఫ్‌యూ చిత్రం కోసం దాదాపు 16 పాటలు కంపోజ్ చేశాను. గచీ పాటను సల్మాన్ పాడితేనే బాగుందని అనుకొన్నాను. సల్మాన్ ఆ పాటను పాడి దానిని అద్భుతంగా మలిచాడు అని విశాల్ మిశ్రా అన్నాడు.

    హీరో..

    హీరో..

    సల్మాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు పాటలు పాడారు. హీరో చిత్రంలో మై హూ హీరో తెరా పాటను, సుల్తాన్ కోసం జగ్ ఘూమేయా, బేబీ కో బాస్ పసంద్ హై, కిక్ చిత్రం కోసం జుమ్మే కి రాత్, హ్యాంగోవర్ పాటలను పాడారు.

    English summary
    Salman Khan behind the microphone was a vision to behold when an unplugged version of Main Hoon Hero Tera came out back in 2015. The auto-tuned version soon became a hit with fans, more than the original song by Armaan Malik. Such is the craze for Salman Khan. Since then the 51-year-old actor has lent his voice to many of his film songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X