సల్మాన్ ఆ సీన్లు కొనలేదు: గబ్బర్ సింగ్ నిర్మాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలోని అంత్యాక్షరీ సీన్‌తో పాటు మరికొన్ని మైండ్ బ్లోయింగ్ సన్నివేశాలపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్..దబాంగ్ 2 చిత్రం కోసం వాటి హక్కులు కొన్నాడని మొన్నామధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వార్తను గబ్బర్ సింగ్ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. అలాంటిదేమీ లేదని, గబ్బర్ సింగ్‌లోని సీన్ల కోసం బాలీవుడ్ నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ బండ్ల గణేష్ స్పష్టం చేశారు. అలాంటిదేమైనా ఇకపై జరిగితే తప్పకుండా చెబుతానన్నారు.
అయితే ఎంత ప్రయత్నించానా..? ఎన్ని ప్రశ్నలు అడిగినా నిర్మాత గణేష్ గబ్బర్ సింగ్ చిత్రం కలెక్షన్లు ఎంత అనే విషయం మాత్రం ప్రకటించడం లేదు. ఏమైనా అంటే రికార్డులు, కలెక్షన్లు ప్రకటించి గొప్పలు చెప్పుకోవడం మా హీరో పవన్ కళ్యాణ్‌కి ఇష్టం ఉండదు అంటూ ఎస్కేప్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెసిందే. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ అందించిన సంగీతం ఈచిత్రానికి బాగా ప్లస్సయింది. ప్రస్తుతం పవన్ పూరి దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











