సల్మాన్ ఖాన్...ఈసారి 10 మంది హీరోయిన్లతో!
2005లో బోనీకపూర్ నిర్మించిన 'నో ఎంట్రీ' అనే బాలీవుడ్ చిత్రంలో ప్లేబాయ్‌గా అలరించిన సల్మాన్ ఖాన్....ఆ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నాడు. 'నో ఎంట్రీ మై ఎంట్రీ' పేరుతో బోనీకపూర్ ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 2014లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది.
ఈ సినిమాలో సల్మాన్ 10 మంది హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా ముఖ్యపాత్రలో నటించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో కూడా సల్మాన్ ప్లేబాయ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'జయహో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. టబు, డైసా షా హీరోయిన్లు. ఈ సంవత్సరాంతంలో సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












