twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శిక్ష అనుభవించకుండానే సల్మాన్ బయట పడతాడా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మద్యం తాగి కారు నడపటంతో పాటు ఒకరి ప్రాణం పోవడానికి, నలుగురు గాయపడటానికి కారణమైన ‘హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ ఖాన్ కు సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిదే. దీనిపై సల్మాన్ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసి బెయిల్ పొందాడు.

    ప్రస్తుతం ఈ కేసుపై వాదోపవాదనలు ముంబై హైకోర్టులో జరుగుతున్నాయి. తాజాగా ఈకేసులో ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ వాదనను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది.ఈ ఘటనలో గాయపడ్డ రవీంద్ర పాటిల్ ప్రధాన సాక్ష్యంగా చెప్పిన వాదనలో పలు విరుద్ధ అంశాలు ఉన్నాయని, ఆ సమయంలో సల్మాన్ మద్యం సేవించి ఉన్నాడన్న విషయాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది.

    ప్రస్తుతం కేసు పరిస్థితి చూస్తుంటే.... ఈ కేసు నుండి సల్మాన్ ఖాన్ బయట పడే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే సల్మాన్ ఖాన్ అభిమానులకు సంతోషమే.

    Salman Khan hit and run case: Possible relief for superstar

    గతంలో సెషన్స్ కోర్టు తీర్పు ఇలా...
    ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు మే 6, 2015న వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందు మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు. జడ్జి తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ ఖాన్ మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేదు. తలదించుకుని ఉన్నారు.

    కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేయడంతో లక్కీగా బెయిల్ దొరికింది. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది.

    English summary
    The Bombay High Court continued to dictate its order in the 2002 hit and run case involving actor Salman Khan today and indications are that the superstar will get a reprieve.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X