»   » హమ్మయ్య... సల్మాన్‌కు శిక్ష పడ లేదు, కేసు వాయిదా

హమ్మయ్య... సల్మాన్‌కు శిక్ష పడ లేదు, కేసు వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘హమ్మయ్య! సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడలేదు'....ఇదీ సల్మాన్ కేసు వాయిదా పడిన తర్వాత ఆయనతో సినిమాలకు కమిటై కోట్లు ఖర్చు పెట్టిన పలువురు నిర్మాతల నుండి వచ్చిన స్పందన. అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు సుమారు రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చని అంతా అనుకున్నారు. మీడియాలో కూడ ఇలాంటి వార్తలే వచ్చాయి.

అయితే ఈ కేసులో జోధ్ పూర్ కోర్టు తుది తీర్పును బుధవారం వెల్లడిస్తుందని అంతా భావించారు. కానీ మార్చి 3 కు తీర్పును వాయిదా వేయడంతో నిర్మాతలు కాస్త కూల్ అయ్యారు. బాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు హీరో సల్మాన్ పై సుమారు 200 కోట్లపైగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.

Salman Khan illegal arms case: Court defers judgment till March 3

సల్మాన్ ఖాన్ జైలుకెలితే ఈ సినిమాలన్నీ మధ్యలోని ఆగిపోయి...నిర్మాతలకు తీవ్ర కలుగనుంది. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు కమిటైన నిర్మాతలంతా కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ ఆయనకు శిక్ష పడితే పై కోర్టులో అప్పీల్ చేసేందుకు, బెయిల్ తీసుకునేందుకు ముందు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం సల్మాన్ సూరజ్ భర్జాత్య డైరక్షన్ లో వస్తున్న‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' షూటింగులో ఉన్నాడు. దీంతో పాటు కబీర్ ఖాన్ దర్శకత్వంలోని భజరంగి భాయ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆయన కమిటైనట్లు సమాచారం.

English summary
A Jodhpur court adjourned the judgment in a case of possession and use of illegal arms by Bollywood actor Salman Khan till March 3.
Please Wait while comments are loading...