twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌పై క్రిమినల్ కేసు.. మళ్లీ ఇబ్బందుల్లో కండల వీరుడు

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మళ్లీ ఇబ్బందుల్లోపడ్డినట్టు కనిపిస్తున్నాడు. తాజాగా సల్మాన్ పై జర్నలిస్టు క్రిమినల్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. తన చోరీ కి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు . 2019 ఏప్రిల్‌లో తన ఫోన్ లాక్కున్నట్టు సీనియర్ జర్నలిస్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ముంబై వీధుల్లో సైక్లింగ్ కోసం సల్మాన్ వెళ్లాడు. ఆ సందర్భంగా జర్నలిస్టు ఫోన్ లాక్కోని దాడికి ప్రయత్నించారు అనే ఆరోపణలు తలెత్తాయి.

     Salman Khan in trouble, criminal case on Bharat hero

    సల్మాన్ సైక్లింగ్ చేయడానికి వెళ్లిన సందర్భంగా మీడియా పెద్ద ఎత్తున హాజరైంది. ఆ క్రమంలో సల్మాన్ ను ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. అందుకోసం బాడీ గార్డుల నుంచి పర్మిషన్ కూడా తీసుకొన్నాం.కానీ సల్మాన్ అభ్యంతరం చెప్పాడు. ఆ సందర్భంగా సల్మాన్‌తో గొడవ జరిగింది. ఆ నేపథ్యంలో సల్మాన్ నా ఫోన్ గుంజుకొన్నాడు. అనంతరం తన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశాడు అని జర్నలిస్టు మీడియాకు వెల్లడించారు. అనంతరం తాను ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, తనకు న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయించానని తెలిపారు.

    కాగా, సల్మాన్ ఖాన్ తరఫు వాదనలు మరోలా ఉన్నాయి. సైక్లింగ్ సందర్భంగా ఫొటోలు గానీ, వీడియోలు గానీ తీయవద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినా సల్మాన్‌ను ఫోటోలు తీయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు అని వెల్లడించారు.

    మీడియా కథనం ప్రకారం.. సల్మాన్ ఖాన్ పై 329/19 ప్రకారం కేసు నమోదైంది. ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద అశోక్ పాండే అనే సీనియర్ జర్నలిస్టు ఈ కేసు నమోదు చేశారు. దొంగతనం, దాడి, నేరపూరితమైన ప్రవర్తన, బెదిరింపులు అనే అంశాలపైన కేసు నమోదైంది. ఫిర్యాదుదారు దాఖలు మేరకు సల్మాన్ ఖాన్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506 323, 392, 426 కింద కేసు నమోదు చేశారు.

    English summary
    Salman Khan has found himself in legal sou once again. A criminal complaint was filed against the Bharat actor, for allegedly snatching the phone of a seniోor journalist during an April 2019 incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X