షూటింగులో గాయపడ్డ సల్మాన్ ఖాన్
'మెంటల్' సినిమా షూటింగులో గాయపడటం సల్మాన్‌కు ఇదే మొదటి సారి కాదు. మార్చి నెలలో కూడా షూటింగ్ జరుగుతుండగా సల్మాన్ గాయపడ్డాడు. తాజాగా మరోసారి గాయపడటం చూస్తే సల్మాన్ రిస్క్‌ను లెక్క చేయకుండా కొన్ని ప్రమాదకరమైన సీన్లు చేస్తున్నాడని స్పష్టం అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలుగు చిత్రం 'స్టాలిన్'కి రీమేక్‌గా సల్మాన్ హీరోగా బాలీవుడ్‌లో 'మెంటల్' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సౌత్ హీరోయిన్ డైసీ షా ఈచిత్రంలో సల్మాన్ కు జోడీగా నటిస్తోంది.
మొదట్లో 'మెంటల్' టైటిల్ బాగానే ఉందని అంతా భావించారు. వెరైటీగా, క్యారీగా ఉంటుందనే ఫిక్స్ చేసారు. అయితే రాను రాను ఈ టైటిల్‌పై హీరో సల్మాన్‌కు అయిష్టత పెరిగిపోతోందట. ఈచిత్రానికి 'జయహో' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక మంచి మెసేజ్ ఫుల్ చిత్రం కావడం, రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించడంతో 'జయహో' టైటిల్ పర్ ఫెక్టుగా ఉంటుందని యోచిస్తున్నారు. త్వరలో టైటిల్ మార్పుపై అపీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












