చెల్లి పెళ్లికి ప్రధాని మోడీని ఆహ్వానించిన సల్మాన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని గురువారం కలిసారు. తను నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘బజ్రంగి భాయ్ జాన్' చిత్రం షూటింగులో భాగంగా సల్మాన్ ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసారు.
ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి సల్మాన్ ఖాన్ వెళ్లి కలిసారు. ఈ నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఉండటంతో మోడీ ఆహ్వానించేందుకు ఆయన వచ్చారు. అర్పిత ఖాన్ వివాహం హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది. ఇద్దరూ ఈవిషయాన్ని ఇంట్లోవారికి చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరుగబోతోంది. విశేషం ఏమిటంటే....అర్పిత ఖాన్ వివాహం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో జరుగనుంది. రెండు రోజుల పాటు ఎంటైర్ హోటల్ సల్మాన్ బుక్ చేసారు. ఇటీవల సల్మాన్ కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాద్ వచ్చి ఇక్కడి ఏర్పాట్లను పర్యవేస్తున్నారు. రెండు రోజుల ఈ వేడుక కోసం కేవలం ప్యాలెస్ మొత్తాన్ని వాడుకున్నందుకు రూ. 2 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం.
నవంబర్ 18వ తేదీన ఈ వివాహ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులంతా ఈ వివాహ వేడుకకు హజరు కానున్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఈ వివాహం జరుగబోతోంది. తన ముద్దుల చెల్లిలి కోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదట సల్మాన్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది.


Click it and Unblock the Notifications











