సల్మాన్ నాకు మంచి ఫ్రెండ్:జూ.ఎన్టీఆర్
సల్మాన్ ఖాన్ తనకు మంచి స్నేహితుడని జూ.ఎన్టీఆర్ రీసెంట్ గా టీవీ నైన్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. అలాగే తను సల్మాన్ అప్పుడప్పుడూ కలుస్తామని,ఎస్.ఎమ్.ఎస్ లు చేసుకుంటామని,అయితే కంటిన్యూగా రోజూ ఫోన్ లు చేసుకోవటం అదీ ఉండదని అన్నారు. ఇక సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాలను వరసగా రీమేక్ చేస్తూండటంతో ఈ వ్యాఖ్య అందరిలో ఆసక్తి రేపింది. ఊసరవెల్లిని సల్మాన్ ఏమన్నా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారేమో అనుకుంటున్నారు.ఇక సల్మాన్ ఖాన్ తాజాగా తెలుగులో హిట్టైన దూకుడు చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని ఆల్రెడీ హిందిలో తానే డైరక్ట్ చేయబోతున్నట్లు తెలియచేసారు. అలాగే తన తదపరి చిత్రాలు గురించి చెబుతూ..బోయపాటి శ్రీను దమ్ము విందు భోజనంలా ఉంటుంది. ఆ తర్వాత శ్రీను వైట్ల, పూరీ జగన్నాధ్ చిత్రాలు ఉంటాయి అన్నారు. ఇక ఊసరవిల్లి విజయం గురించి చెబుతూ..ఊసరవెల్లి నాకు స్పెషల్ ఫిల్మ్. పరిశ్రమ రికార్డులను దాటుకుని ముందుకు వెళ్ళుతోందంటే సంతోషంగా ఉంది. ఏడుపు,నవ్వు, భయం ఒకటేమిటి అన్ని భావోద్వాగాలు ఉన్న చిత్రం. అందుకే రాతలు కాదు తలరాతలు మార్చే చిత్రం అన్నాను అన్నారు ఆనందంగా.


Click it and Unblock the Notifications











