సల్మాన్ ఖాన్ నాకు ఎంత దగ్గరో: కత్రినా

By Pratap

ముంబై: ఏక్ థా టైగర్‌ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రేమికుల్లా నటిస్తున్నారు. వెండితెరపై వారి మధ్య కెమిస్ట్రీ రంజుగా పండిందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. దానికి కత్రినా కైఫ్ మరింత ఆజ్యం పోసింది. నిజ జీవితంలో కూడా సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు తనకు అత్యంత సన్నిహితులని మొహమాటం లేకుండా చెప్పేసింది.

ఆమె ప్రముఖ దినపత్రికతో తన మనోభావాలను పంచుకుంది. సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా తనకు అత్యంత ప్రత్యేకమని, తనకు సన్నిహితులని చెప్పింది. ప్రస్తుతం తాము పరస్పరం కంఫర్టబుల్ స్పేస్‌లో ఉన్నామని ఆమె చెప్పింది.

సల్మాన్ ఖాన్‌పై ఆమె ప్రశంసల వర్షం కూడా కురిపించింది. సల్మాన్ ఖాన్‌పై ఇప్పుడు దృష్టి పడిందని, అతను ప్రశాంతంగా ఉన్నాడని, తానేమిటో తెలుసుకున్నాడని, తనకు ఆనందాన్నిచ్చే సినిమాలే చేస్తున్నాడని చెప్పేసింది. ఏక్ థా టైగర్ అటువంటి సినిమాల్లో ఒక్కటని అభిప్రాయపడింది.

తాము మొదటిసారి రోమాంటిక్ జంటగా కనిపించబోతున్నామని, తమ పాత్రలకు అనుగుణంగా తాము నటించాల్సి ఉంటుందని ఆమె చెప్పేసింది. మాజీ ప్రేమికులు మంచి మిత్రులు కాగలరని చెప్పడానికి కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌లే నిదర్శమని ఈ మాటలు చూస్తే అనిపించకమానదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X