కత్రినా కైఫ్ కైపెక్కించే మరో ‘ఐటెం సాంగ్’
ఓ విభిన్న పాత్రలో కనువిందు చేయడమే గాక అందరినీ అలరించేలా హుషారైన 'ఐటెం సాంగ్'లో కత్రినా చిందేయబోతోంది. ఆడియో ట్రాక్ పూర్తి కావస్తున్నందున దర్శకుడి దృష్టంతా ఇపుడు కత్రినా నటించే పాటపైనే ఉందట. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిందని, 'ఐటెం సాంగ్'పై ఇప్పటి నుంచే ప్రచారం చేయడం తనకు ఇష్టం లేదని దర్శకుడు చెబుతున్నాడు. అందరి అంచనాలకు భిన్నంగా కత్రీనా పాట ఉంటుందని మాత్రం భరోసా ఇస్తున్నాడు.
టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ అంద చందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వరల్డ్ సెక్సియెస్ట్ భామగా కూడా ఆమె కీర్తి కెక్కింది. ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ అభిమానులను మత్తెక్కించే కత్రినా...సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది. బూమ్ చిత్రం ద్వారా ఇండియన్ ఫిల్మ్ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్. ఈ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో మెట్లు అధిగమించాల్సి వచ్చింది. కెరీర్ తొలి నాళ్లలో ఆమె నటనను చూసిన చాలా మంది సినిమా రంగానికి పనికి రాదని విమర్శించారు. తన అందంతో పాటు, నటన, డాన్సింగ్ స్కిల్స్ మరింత మెరుగు పరుచుకుని విమర్శించిన వారి నోటితోనే ప్రశంసలు అందుకుంది.
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ ధూమ్-3 చిత్రంలో తొలిసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న కత్రినా తాను కూడా అమీర్‌తో పోటాపోటీగా స్టంట్స్ చేస్తూ ఏమీ తక్కు కాదని నిరూపించుకుంటోంది. డూప్ లేకుండా స్వయంగా పాల్గొంటోంది. చిన్నచిన్న గాయాలైనా ఎలాంటి భయం లేకుండా అదరగొడుతోంది. వీరి సాహసాలు తెరపై ఉత్కంఠ రేపే విధంగా ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. ధూమ్ 3 చిత్రానికి విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా ముఖ్య తారాగణం. ప్రీతమ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












