twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా కైఫ్ చెల్లి కూడా సల్మాన్ ఖాన్‌తోనే...(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లను, నటులను వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో పాటు, జరీన్ ఖాన్, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లు సల్మాన్ ఖాన్ ద్వారానే ఈ రేంజికి ఎదిగారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా కైఫ్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

    ఓ ప్రముఖ ప్రతిక కథనం ప్రకారం, సల్మాన్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించే సినిమా Dr Cabbie ద్వారా ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన బీయింగ్ హ్యూమన్ సంస్థ, కెనడాకు సంబంధించిన సంస్థలు ఫస్ట్ టేక్ ఎంటర్టెన్మెంట్, కారామెల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రంలో కునాల్ నయ్యర్, అడ్రిన్నె పాలిక్కి, వినయర్ విర్మానీ లీడ్ రోల్స్ చేయనున్నారు. గతంలో ఇసబెల్లా కైఫ్ అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్‌కు జోడీగా 'కమింగ్ హోమ్' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు వార్తలు వినిపించాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆమె సల్మాన్ ఖాన్ Dr Cabbie సినిమా ద్వారా పరిచయం అవుతోందని తెలుస్తోంది.

    కత్రినా కైఫ్ చెల్లి కూడా సల్మాన్ ఖాన్‌తోనే...(ఫోటోలు)

    ఈవిడే సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా

    కత్రినా కైఫ్ చెల్లి కూడా సల్మాన్ ఖాన్‌తోనే...(ఫోటోలు)

    ఇసబెల్లా కైఫ్ అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్‌కు జోడీగా ‘కమింగ్ హోమ్' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.

    కత్రినా కైఫ్ చెల్లి కూడా సల్మాన్ ఖాన్‌తోనే...(ఫోటోలు)

    తల్లితో కలిసి కత్రినా, ఇసబల్లా

    English summary
    One just needs the Bollywood gold mine Salman Khan's midas touch to receive a successful filmy break. We have all known how Salman had taken then newcomers Katrina Kaif, Zarine Khan, Sonakshi Sinha, Arjun Kapoor under his wings for their big break in Bollywood. And, now we hear that the superstar is all set to launch ex-girlfriend Katrina Kaif's sister Isabella Kaif in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X