»   »  లవర్‌ను వెంకటేశ్ చేతిలో పెట్టిన సల్మాన్.. వారి కలయిక వెనుక పెద్ద కథే ఉందబ్బా..

లవర్‌ను వెంకటేశ్ చేతిలో పెట్టిన సల్మాన్.. వారి కలయిక వెనుక పెద్ద కథే ఉందబ్బా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో టాలీవుడ్ సూపర్‌స్టార్ విక్టరీ వెంకటేశ్ హడావిడి చేయడం జాతీయ మీడియాలో చర్చనీయాశమవుతున్నది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా మీడియా కెమెరాకు చిక్కడంతో ఏం జరుగుతున్నదనే అంశంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్ బాలీవుడ్‌లో సినిమా చేస్తున్నాడా? లేక టాలీవుడ్‌లోనే సినిమా కోసం హీరోయిన్‌ ఎంపిక కోసం వెళ్లాడా? మరే నిర్మాతతో ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నాడా? అనే ప్రశ్నలు మీడియాలో జోరుగా వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న రూమర్ ప్రకారం.. వెంకటేశ్ నటించబోయే సినిమాలో హీరోయిన్‌గా రుమేనియాకు చెందిన సింగర్ ఐలియా వాంటర్‌ నటిస్తున్నదనే వార్త వైరల్‌గా మారింది. అయితే సల్మాన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయడానికి పూనుకొన్నాడని, అందుకే ఆమెను వెంకటేశ్ చేతిలో పెట్టాడనే తాజా సమాచారం.

సల్మాన్ ఫొటోషూట్‌లో వెంకటేశ్

సల్మాన్ ఫొటోషూట్‌లో వెంకటేశ్

ముంబైలో జరుగుతున్న సల్మాన్ ఫొటోషూట్‌‌ కార్యక్రమంలో వెంకటేశ్ పాల్గొన్నాడు. సల్మాన్ ఫొటోషూట్‌లో ఉండగా, సెట్లో వెంకటేశ్ సల్లూభాయ్ కోసం వేచి ఉన్నాడనేది బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. సల్మాన్ ఫొటోషూట్‌ నుంచి వచ్చిన తర్వాత వారిద్దరూ అప్యాయంగా పలకరించుకొన్నారని, చాలా సేపు మనసు విప్పి మాట్లాడుకున్నాడనేది వార్త సారాంశం.

సల్మాన్, వెంకీ భేటీలో వాంటర్

సల్మాన్, వెంకీ భేటీలో వాంటర్

వెంకటేశ్, సల్మాన్ మాట్లాడుకుంటుండగా అక్కడే ఉన్న తన ప్రేయసి వాంటర్ వారితో జతకలిసిందట. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో వాంటర్ ఎంట్రీ గురించి చర్చించినట్టు సమాచారం. అయితే వెంకటేశ్ నటించే సినిమాలో వాంటర్ హీరోయిన్‌గా కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

సల్మాన్‌తో వెంకీ బిగ్ ప్లాన్స్

సల్మాన్‌తో వెంకీ బిగ్ ప్లాన్స్

సల్మాన్‌తో భేటీ తర్వాత వాంటర్, వెంకటేశ్ ‌కలిసి ఓ స్పాకు వెళ్లి కాసేపు ముచ్చటించినట్టు సమాచారం. ఆ తర్వాత జరిగిన పార్టీలో సల్మాన్ జాయిన్ అయ్యారనేది ఇన్‌సైడ్ టాక్. అయితే సల్మాన్‌తో కలిసి వెంకటేశ్ భారీ ప్లాన్‌లే వేయడం టాలీవుడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

సల్లూ, వెంకీ భేటీలో బాలీవుడ్ నిర్మాత

సల్లూ, వెంకీ భేటీలో బాలీవుడ్ నిర్మాత

వెంకటేశ్, సల్మాన్ మీటింగ్‌లో బాలీవుడ్ నిర్మాత తరానీ రమేశ్ కూడా ఉండటం మరో చర్చకు దారి తీసింది. రమేశ్ తరానీ రూపొందించే సినిమాలో సల్మాన్, వెంకటేశ్ కలిసి నటిస్తున్నారనే గాసిప్ మీడియాలో ప్రచారమవుతున్నది. ఏ ముహుర్తానా వెంకీ ముంబైలో అడుగుపెట్టారో గానీ జాతీయ మీడియాలో సెన్సేషనల్ వార్తగా మారిపోయారు.

హీరోయిన్‌గా వాంటర్ ప్రయత్నం

హీరోయిన్‌గా వాంటర్ ప్రయత్నం

రుమేనియాకు చెందిన గాయని ఐలియా వాంటర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన కెరీర్‌ను చక్కబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు హిమేశ్ రష్మియా రూపొందించిన ఆప్ సే మౌసిఖీ ఆల్బమ్‌లో కొన్ని పాటలు పాడింది. ప్రస్తుతం గాయని కంటే సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌గానే బాగా పాపులర్ అయింది.

టాలీవుడ్‌లో వాంటర్ ఎంట్రీ

టాలీవుడ్‌లో వాంటర్ ఎంట్రీ

పలు సందర్భాల్లో సల్మాన్‌తో కలిసి వాంటర్ దర్శనమిచ్చింది. సల్మాన్ కుటుంబ వేడుకల్లో కూడా వాంటర్ కనిపించండంతో పెళ్లి చేసుకోబోతున్నారంటే వార్త ప్రచారంలో ఉంది. అయితే గాయనిగా కొనసాగుతూనే నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో వాంటర్‌ ఎంట్రీ కోసం సల్మాన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

English summary
Venkatesh Daggubati, a known face in Tollywood, also Rana Daggubati’s uncle, was spotted with Iulia Vantur last week. The two reportedly did not pose for the media but got into the same car and drove off. Both kept it casual and chic. The pictures obviously had us wondering if Iulia Vantur was planning to venture down South?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu