Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చారిటీకోసం సైకిలెక్కిన స్టార్ హీరో : ఒక్క సైకిల్ 40,000 మాత్రమే
ఇప్పటికే డ్రెసింగ్ సెగ్మెంట్ లో దూసుకుపోతున్న సల్లూ భాయ్.. ఇప్పుడు ట్రాన్స్ పోర్ట్ లోకి కూడా వచ్చేశాడు. కాకపోతే హెల్త్ పేరు చెప్పి సైకిల్స్ అమ్మేయనున్నాడు.
కొన్నాళ్ళ క్రితం సల్మాన్ ట్రాఫిక్ తో రద్దీగా ఉండే ముంబయి నగర వీధుల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల సైకిల్ తొక్కి ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసి విషయాన్ని తెలిపాడు. అనుభవం వున్న వాడిలా హ్యాండిల్ వదిలేసి మరీ సైకిల్ తొక్కాడు. అలాగే ఆయన వెంట బాడీగార్డులు కూడా లేరు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సల్మాన్ సైకిలెక్కాడు అయితే ఈసారి తన సరదా కోసం కాదు మంచికారణం కోసమే.
ఇది తొలిసారేమి కాదు
ఇక కొన్ని వీధుల్లో తనను గుర్తుపట్టిన స్థానికులు, అభిమానులు, పిల్లలతో ముచ్చటించి వారితో ఫోటోలు దిగాడట. అయితే సల్మాన్ సైకిల్ రైడ్ కి వెళ్లడం ఇది తొలిసారేమి కాదు. గతంలో పలుసార్లు ముంబయి వీధుల్లో ఇలానే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. నిజానికి సల్మాన్ తాను చేయాలనుకున్న పని కోసం ఎలాంటి పని చేయటానికైనా నామోషీ పడడు
ముంబయ్ రహదారుల్లో
అంతకు ముందు కూడా ఒకసారి సైకిలెక్కిన సల్మాన్ ముంబయ్ రహదారుల్లో వెళుతుంటే అదేదో చూడకూడని వింతను చూసినట్లు చూస్తారు. మరి.. శ్రీమంతుడు సైకిల్ తొక్కడమంటే చిన్న విషయమా? తాజాగా ముంబయ్‌లోని బాంద్రా-వొర్లి రహదారిలో సల్మాన్ సైకిల్ రైడ్ చేశారు. ఈయనగార్ని గుర్తు పట్టి జనాలు గుమిగూడే ప్రమాదం ఉంది కాబట్టి, చుట్టూ బైకులు, కారుల్లో బాడీగార్డ్స్ ఫాలో అయ్యారు.
బీయింగ్ హ్యూమన్
బీయింగ్ హ్యూమన్ అంటూ సల్మాన్ ఖాన్ కు ఓ కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. రకరకాల ప్రొడక్టులను దీనిలో విక్రయిస్తూ ఉంటారు. ఇప్పటికే డ్రెసింగ్ సెగ్మెంట్ లో దూసుకుపోతున్న సల్లూ భాయ్.. ఇప్పుడు ట్రాన్స్ పోర్ట్ లోకి కూడా వచ్చేశాడు. కాకపోతే హెల్త్ పేరు చెప్పి సైకిల్స్ అమ్మేయనున్నాడు. ఈ-సైకిల్ లాంఛింగ్ ను కూడా తనే చేసేసిన కండలవీరుడు.. ఈ లాంఛింగ్ కోసం తనే సైకిల్ తొక్కుకుంటూ వచ్చేశాడు. బీయింగ్ హ్యూమన్ ఈ-సైకిల్ ను ఇప్పుడు విరివిగా ప్రచారం చేసేస్తున్నాడు సల్లూ భాయ్.
సోహైల్ ఖాన్ కూడా
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ సైకిల్ తొక్కడమే అసలు సిసలైన అట్రాక్షన్. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా ఈ-సైకిల్ లాంఛింగ్ కి.. సైకిల్ తొక్కుతూనే వచ్చాడు. అంతటి స్టార్ హీరో నడిరోడ్డుపై సైకిల్ తొక్కుతుంటే చూపరులకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు #Being cycle అనే హ్యాష్ ట్యాగ్ ఆన్ లైన్ లో బాగా ట్రెండింగ్ అయిపోయింది కూడా.