twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హంతకులకు సల్మాన్ ఖాన్ సపోర్ట్, జియా తల్లి ఆరోపణ

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య సంఘటన పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు సూరజ్ పంచోలితో ప్రేమ వ్యహారమే ఆమె మరణానికి కారణమనే వార్తలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం.....తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె హత్య చేయబడిందని ఆరోపిస్తోంది.

    జియా మరణం వెనక వాస్తవాలను వెలికితీసేందుకు స్వయంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రబియా ఖాన్....తన కూతురు హత్య చేయబడిందనేందుకు పలు ఆధారాలను కూడా సేకరించింది. వీటిని కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో సూరజ్ పంచోలి తరుపున వాదించేందుకు సల్మాన్ ఖాన్ లాయర్ శ్రీకాంత్ శివడే రంగంలోకి దిగారు.

    Salman Khan Lends His Lawyer To Sooraj Pancholi To Fight Jiah Khan's Case!

    సూరజ్ పంచోలి లాంటి వారిని సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ వెనకేసుకురావడంపై గతంలోనే మండిపడ్డ రబియా ఖాన్....తాజాగా సల్మాన్ ఖాన్ తన లాయర్‌ను ఈ కేసు వాదించేందుకు పంపడంపై ఫైర్ అయ్యారు. దీనిపై రబియా ఖాన్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. 'సల్మాన్ ఖాన్ లాంటి వారు హంతకులకు మద్దతుగా నిలవడం సిగ్గు చేటు' అంటూ వ్యాఖ్యానించారు.

    సల్మాన్ ఖాన్ లాయర్ రంగంలోకి దిగిన నేపథ్యంలో తదుపరి విచారణ మార్చి 24న సూరజ్ పంచోలి ఈ కేసు నుండి బయట పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సూరజ్ పంచోలిని తన సినిమా ద్వారా సిని రంగం ప్రవేశం కల్పిచేందుకు సల్మాన్ ఖాన్ చాలా కాలం క్రితమే డిసైడ్ అయ్యారు. అయితే జియా కేసు కారణంగా సూపరజ్ సినీ రంగ ప్రవేశం పెండింగులో పడింది.

    English summary
    
 While late actress Jiah Khan's mother Rabbiya Khan is hell bent on proving that her daughter was murdered by Sooraj Pancholi, megastar Salman Khan is doing everything within his limits to free him of these charges. The latest we hear is that Sallu bhai has lend his most trusted lawyer Shrikant Shivade to fight Sooraj's case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X