హమ్మయ్య...సల్మాన్ ఖాన్ పెళ్లికి ఒప్పుకున్నాడు!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 50 ఏళ్లకు చేరువవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పెళ్లి చూడాలని ఉందని పలువురు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చాడు.
ముంబైలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్న ఆయన తన మనసులోని మాట బయట పెట్టాడు. బాలీవుడ్‌ను ఏలుతున్న ముగ్గురు ఖాన్లు......సల్మాన్, అమీర్, షారూక్ లు కలసి నటించే చిత్రం ప్రారంభమయ్యేలోగా పెళ్లి చేసుకుంటానని సల్మాన్ వెల్లడించాడు.

బాలీవుడ్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా ఉన్న సల్మాన్ నోట నుండి ఈ మాట రాగానే అభిమానులు సంతోషంగా వ్యక్తం చేసారు. బహుషా ఆయన వివాహం 2015లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయన ఎవరిని పెళ్లాడతారు? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ మధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్......తాను ఇప్పటికీ వర్జిన్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇన్నేళ్లయినా సల్మాన్ కాన్ సెక్స్ రుచి చూడలేదంటే ఆశ్చర్యమే మరి.


Click it and Unblock the Notifications











