సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. షార్ప్ షూటర్ అరెస్ట్.. బాంద్రా నివాసం వద్ద రెక్కి!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్యకు ప్లాన్ చేసిన కుట్రను ఫరీదాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దిగ్బ్రాంతికి గురిచేసే విషయాలు బయటపడ్డాయి. దీంతో సల్మాన్ అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు నివ్వెరపాటుకు గురయ్యారు. ఫరీదాబాద్ పోలీసులు వెల్లడించిన విషయాల ప్రకారం..
Recommended Video

రాహుల్ మర్డర్ ప్లాన్ భగ్నం
సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు రాహుల్ అలియాస్ సంగా అలియాస్ బాబా అలియాస్ సున్నీ అనే వ్యక్తి పథకం రచించారు. రాహుల్‌గా షార్ప్‌షూటర్‌గా అనే విషయంలో విచారణలో తేలింది. అయితే రాహుల్‌ను మరింత లోతుగా విచారిస్తున్నాం. అని ఫరీదాబాద్ డీసీపీ రాజేశ్ దుగ్గల్ మీడియాకు వెల్లడించారు.

బాంద్రాలోని సల్మాన్ నివాసం వద్ద రెక్కి
సల్మాన్ ఖాన్ హత్యకు ప్రణాళికను రచించిన రాహుల్ ఇటీవల ముంబైలో రెక్కీ నిర్వహించాడు. గత జనవరిలో ముంబైకి వెళ్లి రెండు రోజులు ఉండి ప్లాన్ చేసుకొన్నాడు. బాంద్రాలోని సల్మాన్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించి కుట్రకు ప్లాన్ చేసుకొన్నాడు అని డీసీపీ రాజేష్ వివరాలను వెల్లడించారు.

లారెన్స్ బిష్ణోయి గైడెన్స్‌తో రంగంలోకి
సల్మాన్ హత్యకు కుట్ర పన్నడం వెనుక ముగ్గురు సభ్యుల హస్తం ఉంది. తన గురువు లారెన్స్ బిష్టోయి, సంపత్ నెహ్రా, మరో వ్యక్తితో కలిసి ప్లాన్ చేశారు. సల్మాన్ హత్యకు ప్లాన్ చేయడానికి ముందు జూన్ 2018లో పోలీసులకు మరో కేసులో దొరికారు. ఆ తర్వాత బిష్ణోయి సూచనతో సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్లాన్ అమలు చేయలేకపోయాడు అని వెల్లడించారు.

ఆరు నెలల్లో నాలుగు హత్యలు
ఫరీదాబాద్ ప్రాంతంలో రాహుల్ కరుడు గట్టిన నేరస్థుడు. లారెన్స్ బిష్ణోయి మార్గదర్శకత్వంలో పలు నేరాలకు పాల్పడ్డారు. గత ఆరు నెలల్లో నాలుగు హత్యలు చేశాడు. స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా చేపట్టిన తనిఖీలో రాహుల్ పోలీసులకు చిక్కారు. ఉత్తరాఖండ్‌లో రాహుల్‌ను ఆగస్టు 15వ తేదీన అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











