నలభై దాటా కాలేజి కుర్రాడిలా బాగోదు
నా వయసు నలభై దాటిపోయింది. నేను పుస్తకాలు పట్టుకొంటే బాగోదు. తెలుగులో హీరో కాలేజీ విద్యార్థిగా కనిపిస్తాడు. అలాగే నేను చేస్తే ఒప్పుకోరు. కాబట్టి ఆ పాత్ర స్వరూపాన్ని మారుస్తున్నాము అంటున్నారు సల్మాన్ ఖాన్. తెలుగులో రామ్ హీరోగా వచ్చిన 'రెడీ' చిత్రాన్ని హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. సల్మాన్‌కి అంతా నచ్చింది. అయినా మార్పులు చెప్తున్నారు.తన పాత్రను తన వయస్సుకు తగ్గట్లు మార్చమ ని దర్శకుడుకి ఆదేశాలు ఇచ్చారు. పోకిరీ హిందీ రీమేక్ వాంటెడ్ సల్మాన్ ఖాన్ కి మంచి కిక్కు ఇచ్చినట్లుంది. దాంతో ఆయన దృష్టి దక్షిణాది చిత్రాలపై పడింది. తాజాగా ఆయన శ్రీను వైట్ల రెడీ రీమేక్ వెర్షన్ లో నటించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
అనీష్ బష్మీ అనే బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టు ను సల్మాన్ తో హిందీలో చేద్దామనుకుంటున్నాం. అలాగే హిందీ ఆడియన్స్ కోసం కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అసిన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు అసిన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో లండన్ డ్రీమ్స్ చిత్రం ప్లాప్ అయింది. మరో ప్రక్క రెడీ చిత్రం తమిళంలో ధనుష్, జెనీలియా కాంబినేషన్లో ఉత్తమపుత్రిన్ పేరుతో రీమేక్ అయింది. మిత్రన్ జవహర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసి హిట్టు కొట్టారు. ఇప్పుడు హిందీలోనూ గ్యారెంటీ హిట్ అని నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











