బీయింగ్ సల్మాన్ ఖాన్ ... "ఏలియన్ చైల్డ్" కి చేయూత
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని మనసున్న మారాజా అని చెబుతుంటారు. అతడిపై ఎన్ని వివాదాలు ముసురుకున్నా .. నలుగురికి సాయపడే మంచి వ్యక్తిత్వం ఉందని పబ్లిక్ స్వయంగా చెబుతుంటారు. మానవతా సాయం పేరిట ఇప్పటికే సల్లూభాయ్ బీయింగ్ హ్యూమన్ అంటూ ఓ ఫౌండేషన్ ప్రారంభించి సేవలు చేస్తున్నాడు. నిస్సహాయుల్ని ఆదుకుంటున్నాడు.అంతేకాదు సల్మాన్ కాశ్మీర్కి చెందిన ఓ పేద కుటుంబానికి ముంబైలో ఓ ఇల్లు కట్టిస్తున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి.ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఉంటాడు.

మరికొన్ని సర్లు కొందరు హీరోయిన్లమీదా చేయిచేసుకున్నాడు సల్మాన్. అందుకే ఏ బాలీవుడ్ పత్రికా అతని గురించి మంచిగా రాసేది కాదు... తర్వాత తర్వాత మార్పు వచ్చినా హిట్ అండ్ రన్ కేసుతోనూ, ఆకేసును తారు మారు చేసి తాను "నిర్దోషీ అని నిరూపించుకోవటం వల్లనూ ఎక్కువ అపఖ్యాతే మూటగట్టుకున్నాడు ఈ సుల్తాన్..

అయితే ఈ కరకు స్వభావం ఉన్న సాత్వికుడు ఇప్పుడు మరో సారి తన సున్నిత హృదయాన్ని చాటుకున్నాడు. సాహిల్ అనే ఏడేళ్ల చిన్నారి క్రౌజోన్ సిండ్రోం అనే అరుదైన వైకల్యంతో నరకయాతన అనుభవిస్తోంది. మామూలు భాషలో ఏలియన్ చైల్డ్ సిండ్రోం అంటారు ఈ లోపం కారణంగా ఆ బాలిక కళ్లు బాగా వాచిపోయి తల, ముఖం ఆకారాన్ని మార్చేస్తాయి. ఇవి బాలిక పుర్రె ఎముకలను అసాధారణంగా మార్చేస్తాయి. దీనికి తోడు ఆ బాలిక అందిరిలాగా బయటకు రాలేదు. సూర్యకాంతి పడితే ఆమె కళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
బాలిక పరిస్థితి చూడలేక ఆమె తల్లిదండ్రులు పలు ఆసుపత్రులను సంప్రదించారు. కానీ అక్కడ ఫీజులు చెల్లించలేక మౌనంగా ఉండిపోయారు. ఈ విషయం సల్మాన్ దృష్టికి వచ్చింది. వెంటనే బాలిక పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడు. బాలిక చికిత్సకు అయ్యే మొత్తం "బీయీంగ్ హ్యూమన్" ఫౌండేషన్ ద్వారా భరిస్తానని మాట ఇచ్చాడు. దీంతో జులై13న బెంగళూరులో సాహిల్‌కు ఆపరేషన్ నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

వైద్యం ఖర్చు మొత్తం సల్మాన్ వ్యక్తిగతంగా చెల్లిస్తున్నాడు. ఈ కండల వీరుడి స్పందించే గుణం ఓ చిన్నారికి నరకయాతన నుంచి విముక్తి కల్పిస్తోంది. మనిషి మంచొడే కాన్నీ ఒక్కో సారి బయటికి వచ్చే రాక్షసుడే సల్మాన్ ని మరింత భయంకరం గా చూపిస్తాడు..


Click it and Unblock the Notifications











