ఐదు కోట్ల పన్ను కట్టిన స్టార్ హీరో
ప్రముఖ సినీ నటుడు సల్మాన్ ఖాన్ ఈ ఏడాది జూలై త్రైమాసానికి గాను ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ పన్ను చెల్లించి రికార్డు సృష్టించారని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డు సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన ఈ పన్ను చెల్లించారు. గత సంవత్సరం రెండు కోట్ల పన్ను చెల్లించిన సల్మాన్ ఖాన్ ఈ ఏడాడి అడ్వాన్ పన్నుకిందే ఇంత మొత్తం చెల్లించడం విశేషంగా ఉంది. ఇటీవలికాలంలో అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతున్న నేపధ్యంలో సినీ నటులు నిజాయితీగా పన్ను చెల్లించాలని భావించడానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చని అంటున్నారు.
గత ఏడాది అమీర్ ఖాన్ ఐదు కోట్లు పన్ను చెల్లించగా, రణబీర్ కపూర్ రెండున్నర కోట్ల రూపాయల మేర పన్ను చెల్లించారు. మొత్తం మీద సినీ రంగంలో మార్పు వస్తే అది పెద్ద సంచలన విషయమే అవుతుంది.ఎందుకంటే బ్లాక్ మనీ విషయంలో సినిమా రంగం అగ్రభాగాన ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తాజాగా కాంచన చిత్రాన్ని రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సల్మాన్ మంచి రేటుకే తన సోదరుడు చేత కొనిపించాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











