డ్రగ్స్ కి అలవాటు పడ్డట్టుగా రీమేక్ లకు అలవాటు పడ్డ స్టార్ హీరో..!?

By Sindhu

డ్రగ్స్ కి అలవాటు పడ్డట్టుగా సల్మాన్ ఖాన్ ఇటీవలి కాలంలో రీమేక్స్ కి అలవాటు పడిపోయాడు. రీమేక్ రాజాగా తనకి పేరు తగిలించినా కానీ సల్మాన్ ఖాన్ ఏమాత్రం సిగ్గు పడడం లేదు.రీమేక్స్ వల్ల వరుసగా హిట్ మీద హిట్టు వస్తుండడంతో మన హీరో వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది కూడా సౌత్ రీమేకులకే! తాజాగా 'బాడీగార్డ్' సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన సల్మాన్, రీమేక్ చిత్రాల మీద ఏర్పడిన గురి కారణంగా ఇప్పుడు స్ట్రైయిట్ చిత్రాలని కూడా కాదంటున్నాడు.

తమ సొంత బ్యానర్ లో తలపెట్టిన షేర్ ఖాన్ చిత్రాన్ని పక్కన పడేసి ఇప్పుడు 'కాంచన' సినిమా రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కథ బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా బాగా నచ్చుతుందన్న అంచనాతో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రీమేక్ పనులు స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకి అతని సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహిస్తాడు. దీనిని త్రీడీ ఫార్మాట్ లో తీసే యోచన కూడా చేస్తున్నారు. కాంచన కథలో ఉన్న సబ్ స్టెన్స్ ఎక్కడి వారికైనా బాగా నచ్చుతుందని, అందుకే ఈ చిత్రాన్ని హిందీలో మరింత క్వాలిటీతో తీసే ఆలోచన కూడా ఉందట.

అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే రంజాన్ కి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వాంటెడ్, దబాంగ్ బాడీగార్డ్ చిత్రాలతో రంజాన్ కి హ్యాట్రిక్ సాధించిన సల్మాన్ ఇకపై ప్రతి రంజాన్ కి తన సినిమా ఒకటి విడుదలయ్యేలా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడు. ఇంకా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనేది ఖరారు కాలేదు. అలాగే శరత్ కుమార్ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలనేది కూడా నిర్ణయించుకోలేదు.పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X