తల్లి, చెల్లివైతే...? కత్రినా బికినీ ఫోటోలపై సల్మాన్ రియాక్షన్!

By Bojja Kumar

ముంబై : కత్రినా కైఫ్ బికినీ ఫోటోలు ఇటీవల లీకై మీడియాలో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్‌తో కలిసి స్పెయిన్లో రహస్యంగా హాలీడే ఎంజాయ్ చేసినప్పటి ఫోటోలు కావడంతో ఈ ఫోటోలపై పెద్ద దుమారమే రేగింది. ఈ ఫోటోలు లీక్ చేసిన మీడియాపై కత్రినా చిర్రుబుర్రులాడింది కూడా.

తాజాగా కత్రినా కైఫ్ బికినీ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ స్టార్ హీరో, కత్రినా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్‌తో పాటు, కత్రినా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కత్రినా బికినీ ఫోటోలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తమదైన రీతిలో రియాక్ట్ అయ్యారు.

ఈ మధ్య ఓ సారి సల్మాన్ మంచి మూడ్లో ఉన్న విషయాన్ని గమనించిన మీడియా ప్రతినిధులు.......కత్రినా బికినీ ఫోటోలపై లీక్‌పై ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై సల్మాన్ స్పందిస్తూ 'ఆ ఫోటో మీ తల్లివో, చెల్లివో లేక మీవి అయితే మీరు ఎలా స్పందిస్తారు?' అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు సల్మాన్.

'పర్సనల్ ఫోటోలను బయటకు లీక్ చేయడం ముమ్మాటికీ తప్పే. అలా చేయడం సరైన చర్య కాదు. మీరు మీ బాయ్ ఫ్రెండుతో ఉన్నపుడు ఆ ఫోటోలు లీక్ అయితే మీరు సహిస్తారా? మీరు సహించరనే అనుకుంటున్నా. ఇతరులకు కూడా అంతే' అంటూ ఆ ప్రశ్నలు అడిగిన వారికి చురకలంటించాడు సల్మాన్.

అయితే కత్రినా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ మరో విధంగా స్పందించారు. 'ఆ ఫోటోల్లో కత్రినా కైఫ్ ఎంతో అందంగా కనిపించింది. ఆ ప్రదేశం(స్పెయిన్) కూడా ఎంతో అందమైంది' అంటూ సమాధానం ఇచ్చాడు. కత్రినా బికినీ ఫోటోలపై రణబీర్ అలా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కత్రినాకు మద్దతుగా మాట్లాడిన సల్మాన్

కత్రినాకు మద్దతుగా మాట్లాడిన సల్మాన్

మీడియా అడిగిన ప్రశ్నలకు సల్మాన్ ఖాన్....కత్రినా కైఫ్‌కు మద్దుతు ఇచ్చే విధంగా మాట్లాడాడు. సినిమాల్లో ఎక్స్ ఫోజింగ్ అనేది మామూలు. కానీ ప్రైవేట్ లైఫ్ ఫోటోలను బయట పెట్టుకోవడాన్ని ఎవరూ ఇష్టపడరు అని వ్యాఖ్యానించారు.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

కత్రినా కైఫ్ తనతో కలిసి ఉన్నప్పటి బికినీ ఫోటోలపై రణబీర్ కపూర్‌ను ప్రశ్నించగా....నాకు గురించి నేను ఎలా చెప్పుకోవాలంటూ జోక్ చేస్తూ మాట్లాడాడు.

కత్రినా ఓపెన్ లెటర్‌ను సమర్థించిన సల్మాన్

కత్రినా ఓపెన్ లెటర్‌ను సమర్థించిన సల్మాన్

తన పర్సనల్ లైఫ్ ఫోటోలను బయట పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కత్రినా కైఫ్ అప్పట్లో మీడియాకు ఓపెన్ లెటర్ రాసింది. కత్రినా చేసిన ఈ పనిని సల్మాన్ ఖాన్ ప్రశంసించారు.

రణబీర్ కపూర్ డొంక తిరుగుడు సమాధానం

రణబీర్ కపూర్ డొంక తిరుగుడు సమాధానం

స్పెయిన్లో కత్రినాతో కలిసి రణబీర్ కపూర్ ఎంజాయ్ చేసిన ఫోటోలపై అతన్ని ప్రశ్నించగా...డొంకతిరుగుడుగా సమాధానం చెప్పాడు రణబీర్. నేను ఇప్పుడు స్పెయిన్లో లేను, అలాంటపుడు ఫోటోలపై ఎలా స్పందించాలి, స్పెయిన్లో ఎంజాయ్ చేసానంతే' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసాడు.

కత్రినా ఎలా స్పందిస్తుందో?

కత్రినా ఎలా స్పందిస్తుందో?

తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ బికినీ ఫోటోలపై ఇలా స్పందించడంపై కత్రినా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఎవరు బాధ్యతగా స్పందించారు?

ఎవరు బాధ్యతగా స్పందించారు?

కత్రినా బికినీ లీక్ ఫోటోలపై ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యతగా స్పందించారంటే ఎక్కువ మంది సల్మాన్ పేరే చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X