Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్లి సందడి: హైదరాబాద్ చేరుకున్న సల్మాన్ (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి వివాహం హైదరాబాద్ లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ కుటుంబ సభ్యులంతా సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు. తాజా సల్మాన్ కూడా హైదరాబాద్‌లో ఎంటరయ్యారు. ప్రత్యేక భద్రత మధ్య ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్ చేరుకున్నారు.
సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, దీపిక పదుకోన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, హేమా మాలిని తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు.
తెలుగు సినమా పరిశ్రమ నుండి వెంకటేష్ తో పాటు చిరంజీవి మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో భద్రత భారీగా ఏర్పాటు చేసారు.
సల్మాన్ ఖాన్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫోటో గ్రాఫర్లకు చిక్కారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సల్మాన్
తాజ్ గ్రూపుకు చెందిన అత్యంత ఖరీదైన లగ్జరీ హోటల్స్‌లో తాజ్ ఫలక్ నుమా హోటల్ కూడా ఒకటి.
సల్మాన్ కు స్వాగతం
రెండు రోజుల పాటు తాజ్ ఫలక్ నుమా హోటల్ వాడుకున్నందుకు గాను దాదాపు రూ. 2 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు సల్మాన్.
సంతోషంగా సల్మాన్
తన ముద్దుల చెల్లి పెళ్లి వేడుక సందర్భంగా సల్మాన్ చాలా సంతోషంగా కనిపించారు. ఆమె కోరుకున్న విధంగా ప్రియుడు ఆయుష్ శర్మతో వివాహం ఫిక్స్ చేసారు.
సల్లూభాయ్‌కి హైదరాబాద్ వెల్లకమ్
ఈ పెళ్లి వేడుకలో దాదాపు 300 మంది అతిథులు పాల్గొంటారని తెలుస్తోంది. ప్యాలెస్ లో 60 లగ్జరీ రూములు ఉన్నాయి. పెళ్లి వేడుక సందర్భంగా ప్యాలెస్ ను అందంగా అలంకరించారు. ఈ ప్యాలెస్ లో 101 సీట్లో కూడిన అతిపెద్ద ఢిన్నింగ్ హాల్ ఉంది.