అల్లు అర్జున్ ది రిజెక్టు చేసిన సల్మాన్ ఖాన్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 చిత్రం బాలీవుడ్ రైట్స్ ని యుటివి తీసుకున్న సంగతి తెలిసిందే. వారు ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ కు స్పెషల్ షో వేసి చూపించారు. అయితే చిత్రం మొత్తం చూసిన సల్మాన్ ఖాన్ తనకు ఆ సినిమా ఆసక్తి లేదని,తాను చేయలేనని రిజెక్టు చేసేసారు. వాంటెడ్ నుంచి వరసగా రీమేక్ లు చేస్తూ వస్తున్న సల్మాన్ ఆ మధ్య తన రెడీ చిత్రంలో ఆర్య 2 లో సూపర్ హిట్ సాంగ్ రింగ రింగను రీమిక్స్ చేసి వాడుకున్నారు. దాంతో సల్మాన్ ఖాన్ కు ఆ చిత్రం పడుతుందని భావించిన నిర్మాతలు ఇలా షో ఏర్పాటు చేసారు.
ఇక సల్మాన్ ఖాన్ ఆ మధ్యన దూకుడు చిత్రాన్ని చేయటానికి కూడా ఆసక్తి చూపలేదు. ఇక్కడ హిట్టు అవటం కన్నా తన బాడీ లాంగ్వేజ్ కు తన వయస్సు సరిపడ సినిమానా కాదా అని చూసుకుని మరీ సినిమాలు ఓకే చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్ కోసం కిక్ రీమేక్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఏక్ ధా టైగర్ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











