‘రెడీ’ తో హిట్ కొట్టి ‘కిక్’ రీమేక్ కి సిద్దమైపోయాడు...
ఇటీవల విడుదలైన 'రెడీ' సినిమా కూడా హిట్ అనిపించుకోవడంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాల మీద కన్నేసినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో హిట్టయిన ఏ సినిమా అయితే హిందీ వాతావరణానికి, తనకు సూట్ అవుతుందో చూసుకుని మరీ రీమేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్' సినిమాని కూడా రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
గతేడాది సూపర్ హిట్ అయిన 'దబాంగ్' సినిమాకి దర్శకత్వం వహించిన అభినవ్ కాశ్యప్ దీనిని డైరెక్ట్ చేయనున్నాడట. ఇందులో 'దబాంగ్' ఫేం సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఆమె తాజాగా ఈ సినిమాకి సైన్ చేసినట్టు బాలీవుడ్ సమాచారం. దీంతో కలిపి సోనాక్షి ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా వుంది.
salman khan ready ravi teja ileana abhinav kashyap dabangg సల్మాన్ ఖాన్ రెడీ రవితేజ ఇలియానా అభినవ్ కాశ్యప్ దబాంగ్


Click it and Unblock the Notifications