దోచేసారు: సల్మాన్ ఖాన్‍కు షాక్ ఇచ్చిన ఆడ దొంగలు
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఇటీవల ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. అభిమానులమంటూ ఆయన దగ్గరికి వచ్చిన నలుగురు అమ్మాయిలు అతని వాలెట్, సన్ గ్లాసెస్, పెండెంట్ కొట్టేసారు. సల్మాన్ ఖాన్ అసలు విషయం గ్రహించే లోగా వారంతా అక్కడి నుండి జారుకున్నారు.
గత వారం సల్మాన్ ఖాన్ బాంద్రలోని ఓ నైట్ క్లబ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నలుగురు అమ్మాయిలు ఆయన దగ్గరికి వచ్చాడు. మేమంతా మీకు ఫ్యాన్స్ అంటూ పరిచయం చేసుకున్నారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తన కూర్చున్న టేబుల్ మీద తన వాలెట్, సన్ గ్లాసెస్, బజరంగీ భాయి జాన్ చిత్రంలో వాడిన పెండెంట్ ఉంచారు.

సల్మాన్ ఖాన్ ను మాటల్లో పెట్టి వాటిని మాయం చేసారట ఆ నలుగురు అమ్మాయిలు. విషయం గ్రహించేలోగా తన వస్తువులతో పాటు ఆ అమ్మాయిలు అక్కడి నుండి తుర్రుమన్నారు. ఈ విషయమై ఆయన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని సలహా ఇచ్చినప్పటికీ.... సల్మాన్ ఖాన్ అందుకు నిరాకరించినట్లు సమాచారం.
ఇటీవల జుహులోని ఓ హోటల్‍కు సినిమా ప్రోమో విడుదల చేయడానికి వచ్చిన సల్మాన్ ఖాన్ టైట్ సెక్యూరిటీతో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముంబై అంత సేఫ్ సిటీ కాదు, ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు. అంతా జాగ్రత్తగా ఉండాలి అని వ్యాఖ్యానించారు. బాంద్రా సంఘటన సల్మాన్ ఖాన్ ఇంకా అప్పటికి మరిచిపోనట్లున్నాడు సల్మాన్ ఖాన్.


Click it and Unblock the Notifications











