హిందీ 'కిక్' లో ఇలియానా పాత్ర ఎవరు చేస్తున్నారంటే...
సల్మాన్‌ఖాన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి సాజిద్ నదియడ్‌వాలా దర్శకత్వం వహించబోతున్నారు. ఇక్కడ ఇలియానా పోషించిన పాత్రకు శ్రీలంక సుందరి జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ని ఎంపిక చేసుకొన్నారు.
తొలుత ఆ పాత్ర ఇలియానాకే దక్కుతుందనుకొన్నారు. కానీ జాక్వెలైన్ వశమైంది. జులై 24 నుంచి ఆమె ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతోంది. 'హౌస్‌ఫుల్', 'రేస్ 2' లాంటి చిత్రాలతో విజయాలు అందుకొంది జాక్వెలైన్. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి.
ఇక ఈ చిత్రానికి సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత ఛేతన్ భగత్ స్రీన్ ప్లే రాయిస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్టు గురించి చేతన్ భగత్ మాట్లాడుతూ... సల్లూభాయ్ అభిమానులకు 'కిక్'ఇచ్చే స్క్రిప్ట్ రాస్తున్నానని చెబుతున్నాడు . ఇక చిత్ర కథ గురించి చెబుతూ.. కిక్కు కోసం ఏదైనా చేసే ఓ యువకుడి పాత్రలో సల్మాన్‌ఖాన్ కనిపించనున్నారు. అలాంటి హీరో ఇమేజ్‌ను మరింత పెంచేలా స్క్రిప్ట్ ఉండాలి అన్నారు.


Click it and Unblock the Notifications












