For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సల్మాన్ గురించి మీకు తెలియని నిజాలు (బర్త్ డే స్పెషల్)

  By Bojja Kumar
  |

  ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇటీవలే 'కిక్' చిత్రంతో హిట్ కొట్టడం, అంగరంగ వైభవంగా తన ముద్దుల చెల్లి అర్పిత ఖాన్ పెళ్లి జరిగిన తర్వాత నుండి సల్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. తన బర్త్ డే వేడుకలను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఫాం హౌస్‌లో గ్రాండ్‌గా జరుపుకుంటున్నాడు.

  అర్ధరాత్రి నుంచే సల్మాన్ అభిమానులంతా ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. డిసెంబర్ 27, 1965న జన్మించాడు. ప్రముఖ బాలీవుడ్ రచయిత సలీమ్ ఖాన్, ఆయన మొదటి భార్య సల్మా ఖాన్ పెద్ద కుమారుడే సల్మాన్ ఖాన్.

  ఈ సంవత్సరం ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఎంతో గ్రాండ్‌గా బర్తడే వేడుకలు జరుపుకుంటున్నారు. ముంబై శివారులోని పాన్‌వెల్ ఫాం హౌస్‌లో నేటి నుండి జనవరి 3 వరకు దాదాపు వారం రోజులు ఇక్కడే ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయబోతున్నారు. న్యూఇయర్ వేడుకలు కూడా ఇక్కడే జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. కొత్తగా పెళ్లని సల్మాన్ చెల్లి అర్పిత్ ఖాన్- ఆయుష్ శర్మ దంపతులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగులో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసారు.

  స్లైడ్ షోలో సల్మాన్ ఖాన్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలతో పాటు సల్మాన్ ఖాన్ గురించి... మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు.స

  గొప్ప ఈతగాడు

  గొప్ప ఈతగాడు

  స్కూల్ డేస్ లో సల్మాన్ ఖాన్... గొప్ప ఈతగాడిగా పేరుపొందాడు.

  తొలుత సహాయ నటుడిగా

  తొలుత సహాయ నటుడిగా

  సల్మాన్ ఖాన్... బీవీ హోతా హై ఆసి(1988) చిత్రంలో సహాయ నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మైనే ప్యార్ కియా సల్మాన్ ఖాన్ తొలి సూపర్ హిట్.

  తండ్రి పేరు వాడుకోలేదు

  తండ్రి పేరు వాడుకోలేదు

  కెరీర్ ఇబ్బందుల్లో పడ్డ సమయంలో సల్మాన్ ఎప్పుడూ సినిమా అవకాశాల కోసం తన తండ్రి సలీమ్ ఖాన్ పేరు ఉపయోగించుకోలేదు. తానే స్వయంగా వెళ్లి ప్రొడ్యూసర్లను ఒప్పించే వాడు.

  దానగుణం

  దానగుణం

  సల్మాన్ ఖాన్ తరచూ రక్తదానం చేస్తూ ఉంటారు. ఆసుపత్రులను సందర్శించి జబ్బుపడిన పిల్లలకు సహాయం చేస్తూ ఉంటారు. అదే విధంగా క్యాన్సర్, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో తన వంతు ప్రచారం చేస్తూ ఉంటాడు.

  ఫిట్ నెస్

  ఫిట్ నెస్

  సల్మాన్ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు... బీజీగా ఉండే రోజుల్లో వీలు కాక పోతే పని మధ్యలో ఏ కాస్త సమయం దొరికినా జిమ్ లో గడుపుతుంటాడు.

  ఇష్టం

  ఇష్టం

  బిఎండబ్లు, మెర్సిడెజ్ బెంజ్, లాండ్ రోవర్లను నడపటం అంటే సల్మాన్ ఖాన్ కు ఎంతో ఇష్టం.

  శిక్షణ

  శిక్షణ

  ఫిట్ నెస్ విషయంలో, రోజూ వ్యాయామం చేసే విషయంలో సల్మాన్ ఖాన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అతను అనిల్ కపూర్, సైఫ్ ఆలీఖాన్ మరియు హృతిక్ రోషన్ వంటి నటులు శిక్షణ ఇచ్చాడు.

  బెస్ట్ లుకింగ్ మెన్

  బెస్ట్ లుకింగ్ మెన్

  2004లో పీపుల్స్ మేగజైన్ వరల్డ్ వైడ్ గా నిర్వహించిన ఓటింగులో సల్మాన్ ఖాన్ 7వ బెస్ట్ లుకింగ్ మెన్ ఆప్ ద వరల్డ్ గా నిలిచాడు.

  లండన్

  లండన్

  లండన్‌కు వెళ్లడానికి సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఇష్ట పడుతుంటాడు.

  అభిమానం

  అభిమానం

  సల్మాన్ ఖాన్ అభిమాన నటుడు సిల్వెస్టర్ స్టోలెన్, అభిమాన నటి హేమా మాలిని.

  English summary
  Bollywood star Salman Khan, turned a year older today, 27th December and he called in all his friends and family for a special birthday bash at his farm house in Panvel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X