twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో భజరంగీ భాయ్‌జాన్ రిలీజ్.. సినిమా పేరు వింటే పడిపడి నవ్వుతారు.. !

    By Rajababu
    |

    Recommended Video

    చైనాలో సల్మాన్ సినిమా.. పేరు వింటే పడిపడి నవ్వుతారు.. !

    చైనాలో దంగల్ చిత్రం విజయఢంకా మోగించిన తర్వాత చాలా బాలీవుడ్ నిర్మాతలు తమ చిత్రాలను అక్కడ ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు. అమీర్ ఖాన్ నటించిన చిత్రం చైనాలో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో రికార్డు కలెక్షన్లను వసూలు చేసిన చిత్రాలను చైనాలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి చిత్రాల జాబితాలో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని చైనాలో రీలీజ్ చేయడానికి సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నారు.

     దేశీయ మార్కెట్‌లో రికార్డు కలెక్షన్లు

    దేశీయ మార్కెట్‌లో రికార్డు కలెక్షన్లు

    2015లో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం విడుదలై రికార్డుస్థాయి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 626 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. 2015లో ఏడాదిలో ఇదే అత్యత్తమ చిత్రంగా నిలిచింది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి పెట్టిన పేరు చాలా నవ్వు తెప్పించేలా.. సరదాగా ఉంది.

     భావోద్వేగమైన కథ

    భావోద్వేగమైన కథ

    భజరంగీ భాయ్‌జాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ అంజనేయ భక్తుడు. వైద్యం కోసం పాకిస్థాన్ నుంచి భారత్‌కు తప్పిపోయిన మున్నీ అనే బాలిక (హర్షాలీ మల్హోత్రా)ను సల్మాన్‌ చేరదీస్తాడు. ఆ తర్వాత ఆ బాలికను పాకిస్థాన్‌లోని తల్లిదండ్రులకు చేరేవేసే క్రమంలో సల్మాన్ ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఇరుదేశాల మధ్య భావోద్వేగాల అంశాల మేలవింపే ఈ కథ.

     నవ్వు తెప్పించే సినిమా టైటిల్

    నవ్వు తెప్పించే సినిమా టైటిల్

    అలాంటి భావోద్వేగమైన భజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి పెట్టిన పేరు లిటిల్ లోలితా.. మంకీ గాడ్ అంకుల్. మంకీ గాడ్ అంటే తెలుగులో హనుమంతుడు.. అంకుల్ అంటే మామ.. లిటిల్ లోలితా అంటే చిన్నారి అని అర్థం. ఈ చిత్రంలో చిన్నారి మున్నీ సల్మాన్‌ను మామ అని పిలువడం తెలిసిందే.

     దిమ్మతిరిగే రేటింగ్..

    దిమ్మతిరిగే రేటింగ్..

    చైనాలోని సినిమాలను విశ్లేషించే ఐఎండీబీ తరహా వెబ్‌సైట్ డౌబాన్ భజరంగీ భాయ్‌జాన్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి 8.6/10 రేటింగ్ ఇవ్వడం విశేషం. చైనాలో ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకొన్న తర్వాత చిత్ర నిడివి 140 నిమిషాలు అని వెల్లడించారు.

     సల్మాన్ కాన్ఫిడెంట్

    సల్మాన్ కాన్ఫిడెంట్

    భారత్‌లో కూడా విజయం సాధించినట్టుగానే చైనాలో కూడా లిటిల్ లోలితా మంకీ గాడ్ అంకుల్ చిత్రం సక్సెస్ సాధిస్తుందనే భావనలో సల్మాన్ ఖాన్ ఉన్నారట. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ సరసన కరీనాకపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు.

    English summary
    Salman Khan's Bajrangi Bhaijaan set to release in China with funny name. This movie titled as Little Lolita Monkey God Uncle!. Bajrangi Bhaijaan has got an incredible 8.6 rating on the site so fans are eagerly looking forward to watch the movie. Douban, China's version of IMDB calls the movie as Little Lolita Monkey King Bajrangi Bhaijaan. The Chinese censored version is said to be about 140 minutes long.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X