భారత్ ట్విట్టర్ రివ్యూ.. ఈద్ కా రాజా సల్మాన్.. బాక్సాఫీస్ రికార్డులకు RIP అంటూ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం భారత్. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కేక పెట్టించడం, సల్మాన్ పోషించిన వివిధ రకాల గెటప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రంజాన్ పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయింది. 1964 నుంచి ప్రారంభమై.. 2010 వరకు సాగే కథలో రకరకాల షేడ్స్‌లో సల్మాన్ కనిపించే అన్ని పాత్రలు సినిమాపై అంచనాలను పెంచాయి.1964లో సర్కస్‌లో స్టంట్ మాస్టర్‌గా, 1970లో మైనింగ్‌లో పనిచేసే కూలీగా, 1985లో నేవీలో పనిచేసే ఆఫీసర్‌గా, 1990లో వయసు మీద పడిన వ్యక్తిగా వివిధ గెటప్స్‌లో సల్మాన్ ఖాన్ కనిపిస్తారు.

భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తున్నది. ఈ సినిమాలో లక్కీగా సల్మాన్‌తో కలిసి నటించే అవకాశం దక్కింది. ప్రియాంక చోప్రా ఈ సినిమాను వదిలేయడంతో ఆ అవకాశం కత్రినాకు దక్కిన సంగతి తెలిసిందే. 2017 తర్వాత టైగర్ జిందా హై సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. ఈ సినిమాపై నెటిజన స్పందన ఇదే..

 తరుణ్ ఆదర్శ్ ట్వీట్

తరుణ్ ఆదర్శ్ ట్వీట్

భారత్ చిత్రంపై ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఎమోషనల్ జర్నీ. ప్రతీ ప్రేక్షకుడి మనసును గెలుచుకొంటుంది. సల్మాన్ ఈ సినిమాకు లైఫ్ లైన్. అద్భుతంగా నటించాడు. కత్రినా ప్రతిభ సూపర్. అలీ అబ్బాస్ జాఫర్ హాస్యాన్ని, ఎమోషనల్ కంటెంట్‌ను అద్భుతంగా మేలవించాడు. నిడివి కాస్త తగ్గిస్తే బాగుంటుందేమో. సల్మాన్ మానియాకు సిద్ధంగా ఉండండి అని సినిమాకు 4 రేటింగ్ ఇస్తూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 కే ఆర్ కే సెటైర్

కే ఆర్ కే సెటైర్

తరుణ్ ఆదర్శ్ రివ్యూపై మరో క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ తీవ్రంగా స్పందించాడు. నిర్మాతలు తరణ్ ఆదర్శ్‌కు మాత్రమే రివ్యూ రాయడానికి అనుమతి ఇచ్చాడేమో. అందుకే అతడు 4 రేటింగ్ ఇచ్చాడు. గతంలో ఆయన దేదే ప్యార్ దే సినిమాకు రేటింగ్ 4 ఇస్తే.. ఆ సినిమా 78 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ సినిమా ప్లాఫ్‌గా మిగిలింది. ఆయన రివ్యూలు అలా ఉంటాయనే విధంగా కేఆర్కే సెటైలర్లు వేశాడు.

సల్మాన్ ఇరుగదీశాడు

సల్మాన్ ఇరుగదీశాడు

భారత్ సినిమా ఇప్పుడే చూశాను. సల్మాన్ ఖాన్ ఇరుగదీశాడు. కత్రినా కైఫ్ తన ఫెర్ఫార్మెన్స్‌తో అద్భుతంగా ఆకట్టుకొన్నది. అలీఅబ్బాస్ డైరెక్షన్ బాగుంది. సునీల్ గ్రోవర్, సతీష్ కౌశిక్ నటన బాగుంది. పైసా వసూల్.. బ్లాక్ బస్టర్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

భారత్ సింప్లీ సూపర్బ్

భారత్ సింప్లీ సూపర్బ్

భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సింప్లీ సూపర్బ్. అతడు తెరపైన నవ్వించాడు.. ఏడిపించాడు. అతని కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రంజాన్ పండుగ నేపథ్యంలో తన ఫ్యాన్స్‌కు సల్మాన్ ట్రీట్ ఇచ్చాడు. ఈ సినిమా అందమైన జర్నీ. ఈద్ ముబారక్ అనడానికి ఈ సినిమా ఫర్‌ఫెక్ట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

 దేశం, ఓ వ్యక్తి జర్నీ

దేశం, ఓ వ్యక్తి జర్నీ

భారత్ సినిమా ఇప్పుడే చూశాను. ఓ వ్యక్తి, ఓ దేశం జర్నీ తెరపైన చూస్తారు. అద్భుతమైన సినిమా. హాస్యం, వినోదం, ఎమోషన్ కలిసి ఉన్న చిత్రం. ఈ సినిమా ప్రేక్షకుడికి అద్భుతమైన ఎమోషన్స్ అందిస్తుంది అని ఓ నెటిజన్ వెల్లడించారు.

సల్మాన్ కత్రినా కెమిస్ట్రీ అదిరింది

సల్మాన్ కత్రినా కెమిస్ట్రీ అదిరింది

సల్మాన్ కెరీర్‌లోనే అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్. ఎమోషనల్ సీన్లలో ఇరుగ దీశాడు. సల్మాన్, కత్రినా కెమిస్ట్రీ అదిరింది. వినోదానికి పెద్ద పీట వేశారు. అలాగే ఎమోషనల్ కంటెంట్‌ను బలంగా చూపారు. అలీ అబ్బాస్ డైరెక్షన్ బాగుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హిస్టరీ క్రియేట్ కావడం గ్యారెంటీ

హిస్టరీ క్రియేట్ కావడం గ్యారెంటీ

భారత్ సినిమా రివ్యూలు ఎక్సౌటింగ్‌గా ఉన్నాయి. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తున్నది. ఇప్పటి వరకు అందిన రిపోర్టు ప్రకారం.. బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ కావడం గ్యారెంటి. సల్మాన్ ఫ్యాన్స్ ఇది నిజమైన ఈద్ అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

అలీ అబ్బాస్ డైరెక్షన్ గురించి

అలీ అబ్బాస్ డైరెక్షన్ గురించి

సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చాలా బాగుంది. సినిమాకు నా రేటింగ్ 4/5. అలీ అబ్బాస్ డైరెక్షన్ బాగుంది. సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ. కత్రినా అందంతో అదరగొట్టింది. స్టోరి బాగుంది. కామెడీ సూపర్. ఎమోషన్స్ సూపర్. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరుగరాస్తుంది అని ట్వీట్ చేశారు.

హాలీవుడ్ స్థాయి డ్రామా

హాలీవుడ్ స్థాయి డ్రామా

భారత్ సినిమాను అందించిన డైరెక్టర్ అలీ అబ్బాస్‌ది హాలీవుడ్ స్థాయి. డ్రామా, హ్యూమర్, ఎమోషన్స్, జర్నీ, ప్రతీ ఒక్కటి తెర మీద అద్భుతంగా పడింది. క్లాసీ స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నా రేటింగ్ 4.5/5. బాక్సాఫీస్ రికార్డులకు RIP అని నెటిజన్ ట్వీట్ చేశాడు.

 రత్నం లాంటి మూవీ

రత్నం లాంటి మూవీ

బాలీవుడ్‌కు ఓ రత్నం లాంటి సినిమా. సల్మాన్ కెరీర్‌లోనే భారత్ బెస్ట్ మూవీ. భజరంగీ కంటే మంచి సినిమా. బాక్సాఫీస్‌ను కుదిపేయడం గ్యారెంటీ. నా రేటింగ్ 4.5/5 . పక్కా బ్లాక్ బస్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X