Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అతడి కోసం రూ. 2 కోట్లు : వార్తల్లో టాప్ హీరో బాడీగార్డ్...!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా వార్తల్లో వ్యక్తిగా మారాడు. సల్మాన్ ఖాన్ వద్ద బాడీగార్డుగా పని చేస్తున్న షేరా అలియాస్ గుర్మీత్ సింగ్ జాలీ.....
ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా వార్తల్లో వ్యక్తిగా మారాడు. సల్మాన్ ఖాన్ వద్ద బాడీగార్డుగా పని చేస్తున్న షేరా అలియాస్ గుర్మీత్ సింగ్ జాలీ.....ఇండియా టూర్లో ఉన్న ఇంటర్నేషనల్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్‌కు బాడీ గార్డుగా నియమించబడటమే.
షేరా గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా షేరా సల్మాన్ ఖాన్ వద్ద బాడీగార్డుగా పని చేస్తున్నాడు. అంతే కాదు ఇండియాలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాడీగార్డు కూడా అతడే.
షేరా కోసం సల్మాన్ ఖర్చు
ముంబై ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం... ‘సల్మాన్ ఖాన్ బాడీగార్డుగా పని చేస్తున్నందుకు గాను అతడు నెలకు రూ. 15 లక్షలు చార్జ్ చేస్తున్నాడట. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 2 కోట్లు.
అతడి జాబ్ అంత ఈజీ కాదు
షేరా జాబ్ మనం ఊహించినంత సులభమైనదేమీ కాదు. భారీగా అభిమానులు ఉండే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ కి ప్రతి క్షణం రక్షణ కల్పించడం అంటే సవాలుతో కూడుకున్నదే.
సల్మాన్ కారు వెంట 8 కి.మీ పరుగు
ఓ సారి సల్మాన్ ఖాన్ కారు వెలుతున్న దారిలో భారీగా అభిమానులు పోగవ్వడంతో దారి క్లియర్ చేయడానికి దాదాపు 8 కిలోమీటర్లు కారుతో పాటు షేరా పరుగులు పెట్టాడట.
సెక్యూరిటీ సర్వీసులోకి
భారీ శరీరం, కండలు తిరిగిన బాడీ ఉండటంతో.... Wizcraft సెక్యూరిటీ కంపెని చెందిన టిమ్మిన్స్ అడగటంతో షేరా సెక్యూరిటీ సర్వీసులోకి వచ్చాడు. 1990 తర్వాత నుండి బాలీవుడ్ ప్రముఖులకు బాడీగార్డుగా పని చేయడం మొదలు పెట్టాడు.
సల్మాన్ తో ఫస్ట్ మీటింగ్
1995లో హాలీవుడ్ స్టార్ కీను రీవెస్ పార్టీకి సల్మాన్ ఖాన్ వచ్చినపుడు తొలిసారిగా షేరా సల్మాన్ ఖాన్ ను కలిసాడు. ఆ తర్వాత నుండి సల్మాన్ కు బాడీగార్డుగా మారిపోయాడు షేరా.
ఆ షో తర్వాత...
ఛండీగడ్ లో ఓ షోలో పాల్గొన్న సల్మాన్....... అక్కడ అభిమానులు చుట్టు ముట్టడంతో తీవ్రగా ఇబ్బంది పడ్డాడు. అప్పుడే ఓ బలిష్టమైన బాడీగార్డ్ కోసం సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ అన్వేషించగా.... షేరా ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఆ ఒక్క ప్రశ్నతో జాబ్ లోకి
జాబ్ ఇంటర్వ్యూకు వచ్చినపుడు సొహైల్ ఖాన్ ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు.... నా సోదరుడు సల్మాన్ ఖాన్ కు ఎప్పుడూ వెన్నంటి ఉంటావా? అని..... దానికి షేరా వెంటనే ‘ఎస్' అని చెప్పారట.
సల్మాన్ నా సర్వస్వం
సల్మాన్ ఖాన్ సాబ్.... ఎంతో మంచి వారు, ఆయన నా సర్వస్వం, ఆయన నా దేవడు, నా జీవితం మొత్తం ఆయన కోసమే పని చేస్తానని షేరా తెలిపారు.