అవకాశాలిప్పిస్తానని రేప్, నటుడి అరెస్ట్...ఆ హీరోకు క్లోజ్!
ముంబై: బాలీవుడ్ నటుడు ఇంద్ర కుమార్‌ను ముంబై పోలీసులు రేప్ కేసులో శుక్రవారం అరెస్టు చేసారు. ఇంద్ర కుమార్‌కు పరిశ్రమలో పెద్దగా పాపులారిటీ లేక పోయినా...బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఇంద్రకుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే పేరు ఉంది. సల్మాన్ ఖాన్ కారణంగానే అతను పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. సల్మాన్ నటించిన పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 22 ఏళ్ల ఓ మోడల్‌కు సినిమా రంగంలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంద్ర కుమార్ ఆమెపై అత్యాచారం చేసాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం 'బాలీవుడ్ సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి ఆమెను అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెతో శారీక సంబంధం పెట్టుకున్నాడు. అవకాశాలు ఇప్పిస్తానని నమ్మ బలికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు'. అతని చేతిలో మోస పోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇంద్ర కుమార్‌పై కేసు నమోదు చేసారు. వెంటనే అతన్ని అరెస్టు చేసారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఖాన్ నటించిన వాంటెడ్ చిత్రంతో పాటు తుమ్ కో భూల్ పాయేంగా, కహి ప్యార్ న హో జాయే చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











