డబ్బున్న హీరో అయితే ఏంటి? : సల్మాన్‌కు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. కృష్ణజింకను వేటాడిన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. చట్టం అందరికీ సమానమేనంటూ, దోషి ఏ స్థాయి వాడైనా ఏ రకమైన మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దేశంలో అత్యధిక స్థాయిలో ఆదాయపన్ను చెల్లిస్తున్నవారిలో తానొకడినని, సినిమా షూటింగ్‌ల నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, స్టే ఇవ్వాలని సల్మాన్ ఖాన్ కోర్టు విన్నవించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు పై విధంగా స్పందించింది. ఈ కేసులో దోష నిర్ధారణ వెల్లడి విషయంలో రాజస్థాన్ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది. ఇటువంటి పద్ధతులల వల్ల దోషుల పట్ల కనికరము చూపినట్లవుతుందని గుర్తించాలని వ్యాఖ్యానించింది. కాగా, ఈ కేసులో తుది తీర్పును అక్టోబర్ 28న వెల్లడించాలని నిర్ణయించింది.
1998లో కృష్ణ జింక ని సల్మాన్ వేటాడినట్లు ఆరోపణలు రావడం తో 2006లో ట్రయల్ కోర్టు సల్మాన్ ని దోషిగా నిర్దారించింది. ఐదేళ్ళ జైలు శిక్ష విధించడం తో 2007లో సల్మాన్ రాజస్తాన్ హై కోర్టు ని ఆశ్రయించారు. ఐతే ట్రయల్ కోర్టు తీర్పుని రాజస్తాన్ హై కోర్టు నిలుపుదల చేయడంతో కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











