»   » బాంబే హైకోర్టు ఎదుట సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం

బాంబే హైకోర్టు ఎదుట సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాంబే హైకోర్టు ఎదుట సల్మాన్ ఖాన్ అభిమాని ఒకరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కోర్టులో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై వాదనలు జరుగుతుండగా సల్మాన్ ఖాన్ అభిమాని విషం తాగాడు. వెంటనే పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన సల్మాన్ కు బెయిల్ మంజూరు కాక ముందు జరిగింది. సల్మాన్ కు బెయిల్ లభించిందనే వార్త తెలియగానే అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు.

సల్మాన్ ఖాన్‌కు బెయిల్...
సల్మాన్ ఖాన్‌కు బాంబే సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ బాంబే హైకోర్టు తీర్పు నిచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నట్లు న్యాయమూర్తి థిప్సే తీర్పు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసారు. బెయిల్ కోసం ఆయన పూచికత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ కేసు విచారణలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని భావిస్తున్నట్లు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందుకే ఆయన బెయిల్ కు అర్హుడని వెల్లడించారు. అయితే సల్మాన్ ఖాన్ తీవ్రమైన నేరం చేసారని, కోర్టును తప్పుదారి పట్టించారని, ఆయనకు బెయిల్ ఇవ్వద్దంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను జడ్డి పట్టించుకోలేదు.

Salman Khan's fan tries to commit suicide

సల్మాన్ ఖాన్ బెయిల్ లభించడం, ఆయన ఇప్పట్లో జైలుకెళ్లే అవకాశం లేక పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు.

అది కేవలం యాక్సిడెంటే అంటూ సల్మాన్ లాయన్ వాదన...
సల్మాన్ తరుపు న్యాయవాది హరీష్ సాల్వే ఇతర కేసు వల్ల వీలు కాక పోవడంతో ఆయన తరుపున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఆరోజు జరిగింది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, మరణానికి కారణమయ్యాడనే అభియోగాలు సల్మాన్ మీద తొలగించాలి....సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలి అని అమిత్ దేశాయ్ జడ్జిని కోరారు. ఈ కేసులో సల్మాన్ తో పాటు కారులో ఉన్న కమాల్ ఖాన్ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదని అమిత్ దేశాయ్ వాదించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులున్నారు, వారంతా ప్రత్యక్ష సాక్షులే, దీనికి క్రింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని అమిత్ దేశాయ్ వాదించారు.

ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తామని కోర్టు వ్యాఖ్యనించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెలుతోందని సాక్షి చెబుతున్నాడని, అయితే హోటల్ నుండి సంఘటన స్థలానికి 14 కిలోమీటర్ల దూరం మాత్రమే. కానీ 30 నిమిషాల సమయం పట్టింది. సల్మాన్ ఖానే కారు నడుపుతున్నట్లు ఎవరూ నిరూపించలేక పోయారని అమిత్ దేశాయ్ వాదించారు. పోలీసులు అధికారుల ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు.

ఈ విచారణకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేదు. ఇంట్లోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విచారణకు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయమై ఆయన అభిమానులు,సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Salman Khan's fan tries to commit suicide by consuming poison from a bottle outside Bombay HC.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu