సల్మాన్ కేసులో కొత్త ట్విస్ట్
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై నమోదైన నిర్లక్ష్య డ్రైవింగ్ కేసు విచారణలో మరింత జాప్యం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాల అసలు ప్రతులతోపాటు కేసు డైరీలు కూడా గల్లంతైనట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు.

2002 సెప్టెంబర్ 28న ముంబయిలో సల్మాన్ కారు.. ఒక బేకరీ బయట రోడ్డు పక్కన నిద్రిస్తున్న జనంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 63 మంది సాక్షుల వాంగ్మూలాల్లో ఏడు మాత్రమే అసలు పత్రాలు ఉన్నాయని, మిగతావి నకలు పత్రాలు ఉన్నాయని పోలీసులు లోగడ న్యాయస్థానానికి తెలియజేశారు.
తాజాగా కేసు డైరీలు కూడా కనిపించడంలేదని చెప్పారు. తొలుత మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసును విచారించినప్పుడు అసలు పత్రాలు ఉన్నాయని, తర్వాత విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసినప్పుడు గల్లంతయ్యాయని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











