»   »  గణేష్ నిమజ్జనం: సల్మాన్ ఖాన్ డాన్స్ (ఫోటోస్)

గణేష్ నిమజ్జనం: సల్మాన్ ఖాన్ డాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ దాదాపు 14 ఏళ్లుగా ప్రతి సంవత్సరం తమ నివాసంలో గణపతిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా నిమజ్జన కార్యక్రమం కూడా గ్రాండ్ గా నిర్వహిస్తారు. సల్మాన్ చిన్న చెల్లెలు అర్పిత ఖాన్ ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని సల్మాన్ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ తండ్రి ముస్లిం ఫ్యామిలీకి చెందిన సలీమ్ ఖాన్ కాగా, తల్లి హిందూ కుటుంబానికి చెందిన సుశీలా చరక్. తాను సగం హిందూ, సగం ముస్లిం అని సల్మాన్ అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు కూడా. సల్మాన్ ఫ్యామిలీలో అన్ని మతాల వారు ఉన్నారు. అందుకే వారు అన్ని మతాల పండగలను జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాలతో సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ సందడిగా ఉంటుంది. ఈ సారి కూడా ఇక్కడే గణేష్ నవరాత్రి సెలబ్రేషన్స్ నిర్వహించారు. గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ డాన్స్ చేసారు. ఉత్సహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్లైడ్ షోలో ఫోటోస్...

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

తల్లితో..

తల్లితో..


తల్లితో కలిసి గణేష్ నిమజ్జన ఉత్సవంలో సల్మాన్ ఖాన్.

డాన్స్..

డాన్స్..


గణేష్ నిమజ్జన ఉత్సవంలో సల్మాన్ ఖాన్ డాన్స్...

సందడి..

సందడి..


గణేష్ నిమజ్జన ఉత్సవంలో సల్మాన్ ఖాన్ సోదరి, బాలీవుడ్ నటి హుమా ఖురేషి డాన్స్

హారతి

హారతి


గణేషుడికి హారతి ఇస్తున్న విదేశీ నటి ఎల్లి అరవమ్

సొహైల్ ఖాన్

సొహైల్ ఖాన్


గణేష్ నిమజ్జన ఉత్సవంలో డాన్స్ చేస్తున్న సొహైల్ ఖాన్.

సల్మాన్

సల్మాన్


నిమజ్జన ఉత్సవంలో సల్మాన్ ఖాన్ సందడిగా గడిపారు.

నిమజ్జనానికి తరలిన గణేషుడు

నిమజ్జనానికి తరలిన గణేషుడు


నిమజ్జనానికి తరలివెలుతున్న గణేషుడు...

ఎకోఫ్రెండ్లీ...

ఎకోఫ్రెండ్లీ...


గణేష్ ఉత్సవాల్లో విగ్రహాలను చెరువులు, సముద్రాలు, సరస్సుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎకోఫ్రెండ్లీ నిమజ్జనం తెరపైకి వచ్చింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేసారు.

జై గణేషా..

జై గణేషా..


నిమజ్జనంతో సల్మాన్ ఖాన్ ఇంట్లో గణేష్ ఉత్సవాలు ముగిసాయి.

English summary
View photos of Bollywood Actor Salman Khan Ganpati Aarti Pooja & Visarjan on September 18, 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu