కిడ్నాప్ కేసులో హీరోయిన్, పోలీసుల గాలింపు!
ముంబై : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'మెంటల్' చిత్రానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయిన హీరోయిన్ సనా ఖాన్ కిడ్నాప్ కేసులో బుక్కయింది. 15 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముంబై మిర్రర్ కథనం ప్రకారం....సనాఖాన్ కజిన్ నవీద్ పెళ్లి ప్రపోజల్ తిరస్కరించడంతో సదరు బాలికకు గుణపాఠం చెప్పాలని సనాఖాన్ డిసైడ్ అయిందని, ఈ క్రమంలో కిడ్నాప్‌కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సనా ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లింది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ 'మెంటల్' షూటింగుకు అంతరాయం ఏర్పడింది.
బాలిక తల్లి సనా ఖాన్‌పై పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాలిక ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సనాఖాన్ ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే సనా ఖాన్ ప్రతినిధి ఇస్మాయిల్ షేక్ వాదన వేరేలా ఉంది. ఆమెపై తప్పుడు కారణాలతో కంప్లైంట్ చేసారు. వారు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఓ మైనర్ బాలికను 18 ఏళ్ల బాలుడు పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ ఖండించారు.

సనా ఖాన్ బిగ్ బాస్ 6లో పాల్గొంది. అలా సల్మాన్ తో ఏర్పడ్డ పరిచయంతో ‘మెంటల్' చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

సనాఖాన్ తెలుగులో మిస్టర్ నూకయ్య, గగణం, కళ్యాణ్ రామ్ కత్తి చిత్రాల్లో నటించింది.

కిడ్నాప్ కేసు బుక్ కావడతోనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ఆమె స్పోక్ పర్సన్ ఇస్మాయిల్ షేక్ ఆమెపై తప్పుడు కారణాలతో పిర్యాదు చేసారని స్పష్టం చేస్తున్నారు.

సనాఖాన్ అజ్ఞాతం వీడి వస్తే గానీ పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











