»   » చిరంజీవి మూవీకి జిరాక్స్! సల్మాన్ ‘జైహో’ ఫస్టలుక్

చిరంజీవి మూవీకి జిరాక్స్! సల్మాన్ ‘జైహో’ ఫస్టలుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఇది ఒరిజినలా? కాదా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకైతే అఫీషియల్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాలేదు.

అందుకు సంబంధించిన ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. తెలుపు రంగు కుర్తాలో, బుక్ చదువుతూ సల్మాన్ బిజీగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఆయన లుక్ గత సినిమాలకంటే కొత్తగా ఉందని అంటున్నారంతా. ఆయన కళ్లజోడుతో దర్శనం ఇవ్వడం కూడా సరికొత్తగా ఉంది.

కాగా..ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.

ఇదే జైహో ఫస్ట్ లుక్ పోస్టరా?

ఇదే జైహో ఫస్ట్ లుక్ పోస్టరా?


ఈ ఫోటో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇదే ఫస్ట్ లుక్ పోస్టరా? కదా? అనేది తేలాల్సి ఉంది.

జైహోషూటింగ్

జైహోషూటింగ్


జై హో మూవీ షూటింగులో సల్మాన్ ఖాన్ స్కూటర్‌పై వెలుతున్న సీన్ చిత్రీకరిస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు.

జై హో...ఒక రీమేక్ మూవీ

జై హో...ఒక రీమేక్ మూవీ


జై హో చిత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘స్టాలిన్' చిత్రానికి అఫీషియల్ రీమేక్. తెలుగులో ‘స్టాలిన్' చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించారు.

జైహో నటీనటులు

జైహో నటీనటులు


ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు డైసీ షా కూడా నటిస్తున్నారు. ఇందులో టబు సల్మాన్ ఖాన్ అక్క పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో టబు పాత్రలో ఖుష్బూ నటించారు.

సొహైల్ ఖాన్

సొహైల్ ఖాన్


ఈ చిత్రాన్ని సల్మాన్ షోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సొహైల్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రాంచైజీపై నిర్మిస్తున్నారు.

English summary
Bollywood superstar Salman Khan's Jai Ho is one of the much-awaited movies of 2014. As per the reports, the first picture of Jai Ho has been doing the rounds on the internet, making us wonder if it is the original first look of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu