మెంటల్ : లవర్ ముందు సల్మాన్ పరువు పాయే!
మొదట్లో 'మెంటల్' టైటిల్ బాగానే ఉందని అంతా భావించారు. వెరైటీగా, క్యారీగా ఉంటుందనే ఫిక్స్ చేసారు. అయితే రాను రాను ఈ టైటిల్‌పై హీరో సల్మాన్‌కు అయిష్టత పెరిగిపోతోందట. సినిమా విడుదలయ్యాక ఏమైనా తేడా వస్తే అంతా తనను మెంటల్ హీరో అని హేళన చేస్తారని భయం ఆయన్ను వెంటాడుతోందట.
ఇటీవల సల్మాన్ ప్రియురాలు లూలియా వేంటర్ 'మెంటల్' మూవీ షూటింగు స్పాటుకు రాగా......అంతా సల్మాన్‌ను మెంటల్ అని పిలుస్తుండటంతో వెటకారంగా నవ్విందట. దీంతో ప్రియురాలి ముందు పరువు పోయినంత పనైందని తెగ బాధ పడ్డాడట సల్మాన్. దీంతో టైటిల్ మార్చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.
ఈచిత్రానికి 'జయహో' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక మంచి మెసేజ్ ఫుల్ చిత్రం కావడం, రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించడంతో 'జయహో' టైటిల్ పర్ ఫెక్టుగా ఉంటుందని యోచిస్తున్నారు. త్వరలో టైటిల్ మార్పుపై అపీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












