For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేనింకా వర్జిన్...పెళ్లికి ముందు సెక్స్ వద్దని అమ్మ చెప్పింది: సల్మాన్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బాలీవుడ్ వివాదాస్పద నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన వర్జినిటీ, పెళ్లికి ముందు సెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన తమ్ముడు సొహైల్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న తొలి సినిమా 'ఫ్రీకీ అలీ' చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన ప్రసంగాన్ని ఆసక్తికరంగా సాగించారు.

  'ఫ్రీకీ అలీ' చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, అమీ జాక్సన్, అర్బాజ్ ఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సినిమాకు పబ్లిసిటీ కల్పించడంలో భాగంగా సల్మాన్ ఖాన్ ను ముఖ్య అతిథిగా పిలిచి కార్యక్రమం ఏర్పాటు చేసార. ఈ సందర్భంగా ఆయన తనపై ఉన్న సెక్స్ రిమార్క్స్, బాలీవుడ్ బ్యూటీలతో తన ఫ్రెండ్షిప్, ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? లాంటి ఆసక్తికర విషయాలు చెప్పారు. స్లైడ్ షోలో సల్మాన్ ఖాన్ చెప్పిన ఆసక్తికర విషయాలు....

  పెళ్లికి ముందు సెక్స్

  పెళ్లికి ముందు సెక్స్

  ఈ కార్యక్రమంలో నవాజుద్దీన్ సిద్దిఖీ సల్మాన్ ఖాన్ ను సెక్స్ గురించి అడిగారు... దీనికి సల్మాన్ ఖాన్ రిప్లై ఇస్తూ ‘నాకు కావాలనే ఉంది.. కానీ ఇప్పటి వరకు ఆ అనుభవం జరుగలేదు. మా అమ్మ పెళ్లికి ముందు సెక్స్ వద్దని చెప్పింది' అంటూ సల్మాన్ ఖాన్ సమాధానం ఇచ్చారు.

  ఆ రెండూ..

  ఆ రెండూ..

  పెళ్లి తర్వాతే సెక్స్ మంచిదని నేను నమ్ముతాను. కానీ సెక్స్, పెళ్లి ఈ రెండూ నా జీవితంలో ఇప్పటి వరకు జరుగలేదు అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

  వర్జినిటీ..

  వర్జినిటీ..

  సల్మాన్ ఖాన్ తన వర్జినిటీ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో కూడా సల్మాన్ ఖాన్ తన వర్జినిటీ గురించి కామెంట్స్ చేసారు. 50 ఏళ్ల సల్మాన్ ఖాన్ తాను ఇప్పటి వరకు సెక్స్ లో పాల్గొనలేదని, తాను ఇంకా వర్జిన్ అని చెప్పడం అప్పట్లో ఓ సెన్సేషన్.

  స్నేహితుల గురించి..

  స్నేహితుల గురించి..

  ఇండస్ట్రీలో తన ఫ్రెండ్షిప్ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..‘నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆడ, మగ, పక్షులు, జంతువులు అందరూ నా స్నేహితులే. ఎవరి పేరు అని చెప్పను?' అంటూ సల్మాన్ ఖాన్ సమాధానం ఇచ్చారు.

  కత్రినాతో స్నేహం గురించి..

  కత్రినాతో స్నేహం గురించి..

  క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరిని అడగ్గా... ‘సంజయ్ దత్ నాకు చిన్న తనం నుండి ఫ్రెండే. షారుక్, అమీర్... వీరి పేర్లు చెబితే మీరు బోర్ ఫీవుతారు. ఎవరైనా అమ్మాయి పేరు చెప్పాలా..? కత్రినా కైఫ్ కూడా నా ఫ్రెండే' అంటూ సల్మాన్ ఆసక్తిగా కామెంట్ చేసారు.

  ఆ రెండు సినిమాలు క్లాష్ అవ్వడంపై..

  ఆ రెండు సినిమాలు క్లాష్ అవ్వడంపై..

  కత్రినా కైఫ్ మూవీ ‘బార్ బార్ దేఖో' సినిమా సమయంలోనే ‘ఫ్రీకీ అలీ' చిత్రం రిలీజ్ అవుతూ క్లాష్ ఏర్పడటంపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ...‘ఇదేమీ క్లాష్ కాదు. మీ మీడియా వారు దాన్ని క్లాష్ గా చిత్రీకరిస్తే క్లాషే అవుతుంది. కత్రినా సినిమాకూడా బాగా ఆడుతుంది. రెండు సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటున్నాం' అన్నారు.

  రిలీజ్ డేట్

  రిలీజ్ డేట్

  సెప్టెంబర్ 9వ తేదీ ఈ సినిమా రిలీజ్ కు మంచి ముహూర్తం అని భావిస్తున్నాం. ఇదేమీ 4 లేదా 5 వేల థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాకాదు. ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్... ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ రీచ్ అవుతారని భావిస్తున్నాను అన్నారు.

  English summary
  Yesterday (August 7, 2016), the trailer of Sohail Khan's upcoming film, Freaky Ali was released and it looks every bit promising and entertaining. The film casts Nawazuddin Siddiqui, Amy Jackson and Arbaaz Khan in the lead roles. At the event, Sohail's Superstar brother Salman Khan was also present to support the trailer of the film!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X