twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe twitter Review: బ్లాక్‌బస్టర్.. సల్మాన్ ఖాన్ ఇరగదీశాడంటూ.. నెటిజన్లు హ్యాట్సాఫ్

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం జీ ప్లెక్స్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దుబాయ్, ఇతర దేశాల్లో రిలీజ్ అయింది. జీ ప్లెక్స్ యాప్‌లో డబ్బులు చెల్లించి చూసే అవకాశాన్ని కల్పించారు. అయితే ట్విట్టర్‌లో సెలబ్రిటీలు ఈ సినిమాపై రివ్యూలను ఇలా వెల్లడించారు. ట్విట్టర్‌లో పేర్కొన్న ప్రకారం..

    పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో

    పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో

    రాధే మూవీ మాస్ ఎంటర్‌టైనర్‌కు బాప్. నా రేటింగ్ 4/5. పవర్‌ఫుల్ డైలాగ్స్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. రణదీప్ హుడా యాక్టింగ్ బాగుంది. ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సూపర్బ్. ఫస్టాఫ్ చాలా బాగుంది సెకండాఫ్ మాస్ ఎండింగ్. మొత్తానికి సూపర్ ఎంటర్‌టైనర్ అంటూ ఓ నెటిజన్ వన్ వర్డ్ రివ్యూ రాశాడు.

    కమల్ నహతా రివ్యూ

    కమల్ నహతా రివ్యూ

    బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ నహతా ట్విట్టర్‌లో తన రివ్యూను రాశాడు. రాధే బ్లాక్ బస్టర్. నా రేటింగ్ 4/5. మాస్ సినిమా. సల్మాన్ ఖాన్, రణదీప్ హుడా పెర్ఫార్మెన్స్ పవర్ ప్యాక్డ్‌గా ఉన్నాయి. దిశాపటానీతో కెమిస్ట్రీ బాగుంది. యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. విజవల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. థ్రిల్స్, ట్విస్టులు, సస్పెన్స్, కామెడీ బాగున్నాయి అని ట్వీట్ చేశారు.

    తరుణ్ ఆదర్శ్ రివ్యూ

    తరుణ్ ఆదర్శ్ రివ్యూ

    ప్రముఖ సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ షాకింగ్ రివ్యూ రాశారు. రాధే చిత్రం డిజాపాయింట్‌గా ఉంది. అవుట్‌లాస్ అనే సినిమాను సరిగా రీమేక్ చేయలేదు. సల్మాన్ ఖాన్ నటన చాలా దారుణంగా ఉంది. స్క్రీన్ ప్లే వీక్‌గా ఉంది. యాక్షన్లు అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ కూడా అతంత మాత్రంగానే ఉంది. ఇంకా ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది అంటూ ట్వీట్ చేశారు.

    మాస్‌ కా బాప్ సల్మాన్ ఖాన్

    మాస్‌ కా బాప్ సల్మాన్ ఖాన్

    రాధే మూవీ బ్లాక్‌బస్టర్. నా రేటింగ్ 4, పక్కా మాస్ సినిమా ఇది. సల్మాన్ ఖాన్, హుడా పవర్ ప్యాక్డ్ యాక్టింగ్ బాగుంది. సల్మాన్ మాస్‌కు బాప్ అని మరోసారి రుజువు చేశాడు అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

    బ్లాక్ బస్టర్ అని ఒక్కమాటలో

    బ్లాక్ బస్టర్ అని ఒక్కమాటలో

    రాధే సినిమా బ్లాక్‌బస్టర్ అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇప్పటి వరకు సల్మాన్ కెరీర్‌లో ఇదే బెస్ట్. సినిమా లెంగ్త్, ఉత్కంఠగా నడిచే కథ, కామెడీ టైమింగ్ బాగుంది. దుబాయ్‌లో నేను ప్రీమియర్ చూశాను. సల్మాన్ స్టార్ డమ్ మరోసారి హైలెట్ అయింది అంటూ ఓ నెటిజన్ తన రివ్యూను ట్వీట్ చేశాడు.

    స్టైలిష్‌గా ఉందంటూ..

    స్టైలిష్‌గా ఉందంటూ..

    సల్మాన్ ఖాన్ సినిమాలకు రేటింగ్ ఇవ్వాలంటే.. రాధే, వాంటెడ్, కిక్, బాడీగార్డ్ అని చెబుతా. ఈ సినిమా స్టైలిష్‌గా ఉంది. సినిమా చూడాలా వద్దా అనేది నీ ఛాయిస్. విమర్శకుల రివ్యూలను పట్టించుకోవద్దు. మీ ఇంట్రెస్ట్‌ను బట్టి సినిమా చూడండి. ఓవరాల్‌‌గా రాధే సినిమాను మీరు ఇష్టపడుతారు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

    రాధే మూవీ నిరాశపరిచింది..

    రాధే మూవీ నిరాశపరిచింది..

    రాధే మూవీ చాలా నిరాశపరిచింది. నా రేటింగ్ 1.5. ఏదో విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు దారుణంగా ఫ్లాప్. స్క్రీన్ ప్లే చెత్తగా ఉంది. డైరెక్షన్ బాగాలేదు. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో నాసిరకమైన సినిమా. సినిమా చూడటం అంటే అది మీ రిస్కే అంటూ కామెంట్ చేశాడు.

     సీటీ మార్ సీన్లతో

    సీటీ మార్ సీన్లతో

    రాధే చిత్రంలో కొన్ని సీటీ మార్ సీన్లు ఉన్నాయి. హీరో, విలన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కోరుకొనే విధంగా ఫైట్లు, యాక్షన్ సీన్లు ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

    రాధే సినిమా ఓ టార్చర్

    రాధే సినిమా ఓ టార్చర్

    రాధే చిత్రం కరోనావైరస్ సంక్షోభం కంటే దారుణంగా ఉంది. టార్చర్‌ను భరించలేం. సల్మాన్ ఖాన్ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఆయన భజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్ లాంటి సినిమాలు చేయాలి. స్టోరి యావరేజ్‌గా ఉంది. సల్మాన్, దిశా యాక్టింగ్ బాగాలేదు. రణ్‌దీప్ హుడా ఫెర్ఫార్మెన్స్ బాగుంది.

     రాధే చూడాలంటే..

    రాధే చూడాలంటే..

    రాధే సినిమా గురించి ఓ నెటిజన్ దారుణంగా ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూడాలంటే తప్పకుండా కావాల్సినవి. జండు బామ్, పారాసిటామోల్ ట్యాబ్లెట్, ఒక అంబులెన్స్ అంటూ ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
     ఒక్కసారి చూడవచ్చు...

    ఒక్కసారి చూడవచ్చు...

    రాధే మూవీని చూశాను. నా రేటింగ్ 2.5/5. సల్మాన్ ఖాన్ ఫెర్పార్మెన్స్ బాగా లేదు. దిశా పటానీ తన వరకు తాను బాగా చేసింది. ఈ సినిమా ఓ సారి చూడవచ్చు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు

    English summary
    Salman Khan's Radhe twitter Review: Movie is full paced with high octane scenes ... Salman khan at its best.. One big suspense in the second half ... Movie time is just 1 hr and 45 minutes..Full review cumin soon..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X