twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ సిస్టర్ మ్యారేజ్ ఇన్విటేషన్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది. ఇద్దరూ ఈవిషయాన్ని ఇంట్లోవారికి చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరుగబోతోంది. తాజాగా వీరి మ్యారేజ్ ఇన్విటేషన్ ఫోటోలు బయటకు వచ్చాయి.

    సల్మాన్ ఖాన్ తన రేంజికి తగిన విధంగా ఈ ఇన్విటేషన్ వేయించారు. 18, 19వ తేదీల్లో వివాహం గ్రాండ్‌గా జరుగనుంది. సంగీత్, మెహందీ, వివాహ వేడుకల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

    విశేషం ఏమిటంటే....అర్పిత ఖాన్ వివాహం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో జరుగనుంది. నవంబర్ 18, 19 రెండు రోజుల పాటు ఎంటైర్ హోటల్ సల్మాన్ బుక్ చేసారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    ఏర్పాట్లు

    ఏర్పాట్లు

    ఇటీవల సల్మాన్ కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాద్ వచ్చి ఇక్కడి ఏర్పాట్లను పర్యవేస్తున్నారు. రెండు రోజుల ఈ వేడుక కోసం కేవలం ప్యాలెస్‌ను వాడుకున్నందుకు రూ. 2 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం.

    రిసెప్షన్

    రిసెప్షన్

    వివాహం అనంతరం నవంబర్ 21న తేదీన ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. పెళ్లి వేడుకకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించినట్లు సమాచారం.

    కోట్లాది రూపాయల ఖర్చు

    కోట్లాది రూపాయల ఖర్చు

    సల్మాన్ ఖాన్ సోదరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులంతా ఈ వివాహ వేడుకకు హజరు కానున్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఈ వివాహం జరుగబోతోంది.

    హిందూ, ముస్లిం సాంప్రదాయం

    హిందూ, ముస్లిం సాంప్రదాయం

    తన ముద్దుల చెల్లిలి కోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదట సల్మాన్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది.

    పరిమిత సంఖ్యలో

    పరిమిత సంఖ్యలో

    ఈ వివాహ వేడుకకు దేశ వ్యాప్తంగా 250 ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వెంకటేష్ కూడా ఈ ఆహ్వానం అందుకున్నారు.

    English summary
    While the 'Khan' khandaan is awaiting their sister Arpita Khan's wedding on November 18, fans of Salman Khan are eager to know every single detail about the wedding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X