హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్ సిస్టర్ ప్రేమ వివాహం
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది. ఇద్దరూ ఈవిషయాన్ని ఇంట్లోవారికి చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరుగబోతోంది.
విశేషం ఏమిటంటే....అర్పిత ఖాన్ వివాహం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో జరుగనుంది. ఇటీవల సల్మాన్ కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాద్ వచ్చి ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు సమాచారం. వివాహ విషయాన్ని సల్మాన్ ఖాన్ తండ్రి, సినీ రచయిత సలీమ్ ఖాన్ ధృవీకరించారు.

వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. తమ కుటుంబ సభ్యులం అంతా కలిసి చర్చించుకుని చారిత్రాత్మక ఫలక్ నుమ ప్యాలెస్‌లో వివాహం జరుపాలని నిర్ణయించుకున్నామని సలీమ్ ఖాన్ తెలిపారు. త్వరలో వివాహ తేదీ ప్రకటించనున్నారు.
సల్మాన్ ఖాన్ సోదరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులంతా ఈ వివాహ వేడుకకు హజరు కానున్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఈ వివాహం జరుగబోతోంది. తన ముద్దుల చెల్లిలి కోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదట సల్మాన్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది.


Click it and Unblock the Notifications











