టైగర్‌ను మించి వేటాడగలరా? సల్మాన్ సవాల్.. దిమ్మతిరిగేలా ట్రైలర్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తాజా చిత్రం టైగర్ జిందాహై తొలి ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ప్రాణాలు లెక్క చేయకుండా మరోసారి దేశం తరపున పోరాటం చేసే గూఢచారి అవతారం ఎత్తాడు సల్మాన్.
Recommended Video

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తాజా చిత్రం టైగర్ జిందాహై తొలి ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ప్రాణాలు లెక్క చేయకుండా మరోసారి దేశం తరపున పోరాటం చేసే గూఢచారి అవతారం ఎత్తాడు సల్మాన్. అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన దృశ్యాలు హాలీవుడ్ స్ఠాయిలో ఉన్నాయి. ఈ ట్రైలర్‌లో ఆకట్టుకునే అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇరాక్‌లో సల్మాన్ ఖాన్
ఈ భూప్రపంచం పుట్టిన దగ్గర నుంచి అన్ని చోట్ల మంచి, చెడుకు, వెలుగు, చీకట్ల మధ్యనే యుద్ధం జరిగింది. ఇరాక్‌లో టైగర్ (సల్మాన్) చేపట్టిన మిషన్ అనేది ఈ చిత్రం ప్రధాన కథ అనేది తెలుస్తున్నది.

నర్సులను రక్షించే
అంతర్జాతీయ ఉగ్రవాది నాయకుడు ఉస్మాన్ చేతిలో బందీగా ఉన్న 25 మంది నర్సులను ఎవరు కాపాడగలరు అనే ప్రశ్నకు సమాధానమే టైగర్. ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా సల్మాన్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించనున్నారనే విషయం ట్రైలర్ అర్థమైంది.

సల్మాన్ చెప్పిన డైలాగ్స్
టైగర్ జిందా హై ట్రైలర్‌లో ‘అందరూ వేటాడుతారు. కానీ వేటాడంలో టైగర్ కంటే ఎవరైనా ఎక్కువగా వేటాడగలరా అనే డైలాగ్స్ ఆకట్టుకొన్నేలా ఉన్నాయి. రెండు రోజుల వ్యవధిలో బందీలను ఎలా రక్షించాలి.. ఉస్మాన్‌ను హతం ఎలా చేయాలి' అని సల్మాన్ చెప్పిన డైలాగ్స్ అభిమానుల్లో అంచనాలు పెంచాయి.

కత్రినా యాక్షన్ సీన్స్ అదుర్స్
ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ సరసన నటించిన కత్రినా కైఫ్ మరోసారి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించింది. ట్రైలర్‌లో కత్రినా చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రంలో జోయా అనే గూఢచారి పాత్రలో కత్రినా కనిపించనున్నది.

సల్మాన్ స్పెషల్ ట్రైనింగ్
టైగర్ జిందా హై చిత్రం కోసం సల్మాన్ ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. గన్ షూటింగ్ సంబంధించిన ట్రైనింగ్‌ను కూడా తీసుకొన్నాడు. ఆయన క్రేజ్ తగినట్టుగా కొత్త రకంగా గన్స్‌ను ఉపయోగించాం అని దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ వివరించారు.
మళ్లీ సల్మాన్, అబ్బాస్ కాంబినేషన్
టైగర్ జిందా హై చిత్రం డిసెంబర్ 22న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం తర్వాత సల్మాన్, అబ్బాస్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్నది. దక్షిణ కొరియా చిత్రం ఆడ్ టూ మై ఫాదర్ అనే చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నది. ఈ చిత్రానికి సల్మాన్ బావ, నటుడు అతుల్ అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరిస్తారు.


Click it and Unblock the Notifications











