»   » కత్రినాకు సల్మాన్ హగ్, పెళ్లికి హాజరవుతానని వ్యాఖ్య (ఫోటోలు)

కత్రినాకు సల్మాన్ హగ్, పెళ్లికి హాజరవుతానని వ్యాఖ్య (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్ మధ్య గతంలో ఎఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కొంత కాలం డేటింగ్ కూడా చేసారు. కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత షరా మామూలుగానే ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్‌తో డేటింగులో ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కత్రినా కైఫ్ పెళ్లి జరిగితే మీరు వెళతారా? అనే ప్రశ్నకు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.....ఆమె ఆహ్వానిస్తే తప్పకుండా వెళతాను అని సమాధానం ఇచ్చారు. కత్రినా కైఫ్‌తో రిలేషన్ షిప్ గురించి సల్మాన్ ఖాన్‌ను ప్రశ్నించగా...ఒకప్పుడు ఆమె నా ఫ్రెండ్, కానీ ఇపుడు వేరొకరి ఫ్రెండ్, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఉండచ్చు అని వ్యాఖ్యానించారు.

ఆ ఇంటర్వ్యూ సంగతి పక్కన పెడితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఇద్దరూ కలిసినట్లు సమాచారం. తన తాజా సినిమా 'జై హో' ప్రమోషన్లో సల్మాన్ ఉండగా....అదే సమయంలో ఓ కమర్షియల్ యాడ్ షూటింగులో భాగంగా అటు వైపు కత్రినా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నారని, చివర్లో ఇద్దరూ హగ్ చేసుకున్నారని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి ఫోజు

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి ఫోజు


సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మధ్య ఒకప్పుడు లవ్ ఎఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి గురించి బాలీవుడ్లో హాట్ టాపిక్ నడిచింది.

బ్లాక్ డ్రెస్‌లో కత్రినా సల్మాన్

బ్లాక్ డ్రెస్‌లో కత్రినా సల్మాన్


బ్లాక్ డ్రెస్సులో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ లుక్ అదిరిపోయింది కదూ. వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ నడిచే సమయంలో తీసిన ఫోటో ఇది.

ఓ ఈవెంటులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్

ఓ ఈవెంటులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్


చేసినంత కాలం స్నేహం చేసారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నంత కాలం లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహ పూర్వకంగా విడిపోయారు.

సల్మాన్, కత్రినా, రాజ్ పాల్ యాదవ్

సల్మాన్, కత్రినా, రాజ్ పాల్ యాదవ్


ఒకప్పుడు తమ సినిమా ప్రమోషన్లో భాగంగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, పక్కనే బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్.

ర్యాంప్ వాక్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా

ర్యాంప్ వాక్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా


ఓ ఫ్యాషన్ షో కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇలా ర్యాంప్ వాక్ చేసారు. వారి వెనకాల సైఫ్ అలీ ఖాన్ ఉన్న దృశ్యాన్ని కూడా మీరు చూడొచ్చు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్


గతంలో తమ సినిమాల ప్రమోషన్లో భాగంగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రెస్ కాన్ఫరెన్సులో ఇలా.....

సల్మాన్-కత్రినా

సల్మాన్-కత్రినా


గతంలో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ చాలా సంతోషంగా కలిసి తిరిగారు. ఇలా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

టీవీ కార్యక్రమంలో సల్మాన్-కత్రినా

టీవీ కార్యక్రమంలో సల్మాన్-కత్రినా


తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా గతంలో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ టీవీ షోలో పాల్గొన్నప్పటి దృశ్యం.

తమ ఆలోచనలు పంచుకుంటూ...

తమ ఆలోచనలు పంచుకుంటూ...


సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తమ అభిప్రాయాలు పంచుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండగా తీసిన ఫోటో ఇది.

కత్రినాతో చనువుగా...

కత్రినాతో చనువుగా...


గతంలో సల్మాన్ ఖాన్ దస్ కా దమ్ అనే టీవీ షో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కత్రినా‌తో సల్మాన్ ఖాన్ ఇలా చనువుగా...

కత్రినా, సల్మాన్ ఇప్పటికీ స్నేహితులే...

కత్రినా, సల్మాన్ ఇప్పటికీ స్నేహితులే...


కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ ప్రేమ పరంగా విడిపోయినా...ఇద్దరూ ఇప్పటికీ స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు

English summary
Salman Khan and Katrina Kaif, who were once dating each other have long fallen apart. While Katrina is rumoured to be dating Ranbir Kapoor, Salman Khan too has moved on in life. When Sallu was recently asked if he would attend Katrina's wedding, he said he 'would' if invited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu