క్షమాపణ చెప్పాడా? మళ్ళీ పరువు తీసాడా?? బిగ్ బాస్ షోలో మళ్ళీ కుక్కలని తెచ్చిన సల్మాన్

బిగ్ బాస్ సీజన్ 11 కొత్త ఎపిసోడ్ లో కుక్కలకు సారీ చెబుతూ స్టార్ట్ చేసి సరదా సరదా జోకులతో ఆ గొడవని మరిపించే ప్రయత్నం చేసాడు సల్మాన్ ఖాన్.

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 11 రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్ స్టార్ట్ కాక ముందు చాలా రసవత్తరంగా ఉంటుంది అని సల్లు భాయ్ ముందే హింట్ ఇచ్చినప్పటికీ మరీ ఇంత రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు కూడా ఊహించలేదు. నిన్న వారం జుబైర్ ఖాన్ తో గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్ళింది.

 జుబైర్ ని ఉద్దేశించి కుక్క అనడం

జుబైర్ ని ఉద్దేశించి కుక్క అనడం

నిర్వాహకులు ఎలాగోలా మ్యానేజ్ చేసారు కాని లేదంటే సల్మాన్ కు ఇది ఇమేజ్ పరంగా పెద్ద తలనెప్పిగా మారేది. ఒక వివాదంలో సల్మాన్ ఖాన్, జుబైర్ ని ఉద్దేశించి కుక్క అనడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిన్ను కుక్కను చేసి ఆడుకుంటాను అని సల్మాన్ అనడం. జుబైర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయటం, అతన్ని ఎలిమినేట్ చేసాక సూసైడ్ అటెంప్ట్ చేయటం చాలా సెన్సేషన్ అయ్యింది.

కుక్కలకు సారీ చెబుతూ

కుక్కలకు సారీ చెబుతూ

కొత్త ఎపిసోడ్ లో కుక్కలకు సారీ చెబుతూ స్టార్ట్ చేసి సరదా సరదా జోకులతో ఆ గొడవని మరిపించే ప్రయత్నం చేసాడు. తెలుగు, తమిళ్ బిగ్ బాస్ షోలలో ఇలాంటివి లేకే చప్పగా ఉన్నాయి అంటున్నారు ప్రేక్షకులు. అక్కడ సల్మాన్ కాబట్టి ఇవన్ని తట్టుకున్నాడు కాని సున్నితమైన మనోభావాలు ఉండే మన స్టార్ హీరోల ఫాన్స్ ఇవన్ని తట్టుకుంటారా అన్నదే కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న.

ప్రపంచంలోని కుక్కలన్నింటికీ

ప్రపంచంలోని కుక్కలన్నింటికీ

ఈ వారం కుక్క అనే పదం వాడినందుకు గానూ క్షమాపణ చెప్పాడు. ‘గతవారం నేను ‘కుక్క' అనే పదం వాడాను. ఇందుకుగాను ప్రపంచంలోని కుక్కలన్నింటికీ క్షమాపణలు చెబుతున్నాను. అవి ఎంతో నమ్మకంతో పనిచేస్తాయి' అని ప్రముఖ హీరో అన్నాడు. వివరాల్లోకి వెళితే... బిగ్‌బాస్ - 11లో జుబైర్ ఖాన్ వివాదాన్ని మరిపించేందుకు హీరో సల్మాన్ ఖాన్ వీకెండ్ ఎపిసోడ్‌లో మరిన్ని జిమ్మిక్కులు చేశాడు.

నిన్ను కుక్కను చేసి ఆడుకోకపోతే

నిన్ను కుక్కను చేసి ఆడుకోకపోతే

షో ప్రారంభం కాగానే కుక్కల గురించి ప్రస్తావించి వాటికి క్షమాపణలు చెప్పాడు. కాగా అంతకు ముందువారం సల్మాన్... కంటెస్టెంట్ జుబైర్‌ఖాన్‌పై విరుచుకుపడ్డాడు. ఈ సందర్భంగా జుబైర్‌తో ‘నిన్ను కుక్కను చేసి ఆడుకోకపోతే నా పేరు సల్మాన్ ఖాన్ కాదు' అని సల్మాన్ అన్నాడు. ఇది మరింత వివాదానికి దారితీసింది. దీంతో జుబైర్ ఆత్మహత్యాప్రయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొంది బయటపడ్డాడు. తరువాత జుబైర్... సల్మాన్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X