Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శత్రువులైన ఆ హీరోలిద్దరూ.. ఇక ఇరుగుపొరుగులు!
ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఇద్దరి ఖాన్ ల మధ్య వార్ జరుగుతోంది. ఎవరూ ఒకరికి ఒకరు తగ్గకుండా తమ ఏటిట్యూడ్ ని చూపించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వాళ్లిద్దరే షారూఖ్ ,సల్మాన్ ఖాన్. బాలీవుడ్లో ఎడముఖం పెడముఖంగా ఉండే సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్ ఇరుగుపొరుగు వాసులు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్‌ఖాన్ తన కుటుంబ సభ్యులతో గెలాక్సీ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు చిన్నది కావడం, స్థలాభావంతో శునకాల పెంపకం, గృహోపకరణాల హంగులు సమకూర్చుకొనేందుకు స్థలం లేకపోవడంతో కొంతకాలంగా ఆయన కొత్త ఇంటికోసం అన్వేషణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో బాంద్రా బ్యాండ్ స్టాండ్‌లోని షారుక్ ఇల్లు 'మన్నత్'కు సమీపంలోనే సల్మాన్ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం సల్మాన్ కొనుగోలు చేసిన 'సాగర్ రేషమ్' బిల్డింగ్ షారుక్ ఇంటికి రెండిళ్ల దూరంలో ఉంది.
ఈ ఇల్లు ఒక గుజరాతీ కుటుంబానికి చెందినది కాగా ఆ ఇంటిని సల్మాన్ రూ.100 కోట్లతో సొంతం చేసుకున్నట్లు ప్రచారం. సల్మాన్ ఆ ఇంటికి రెండు, మూడు పర్యాయాలు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారని, ఇందుకు సంబంధించిన ఒప్పంద వ్యవహారాలు పూర్తయినట్లేనని విశ్వసనీయ సమాచారం.