twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శత్రువులైన ఆ హీరోలిద్దరూ.. ఇక ఇరుగుపొరుగులు!

    By Srikanya
    |

    ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఇద్దరి ఖాన్ ల మధ్య వార్ జరుగుతోంది. ఎవరూ ఒకరికి ఒకరు తగ్గకుండా తమ ఏటిట్యూడ్ ని చూపించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వాళ్లిద్దరే షారూఖ్ ,సల్మాన్ ఖాన్. బాలీవుడ్‌లో ఎడముఖం పెడముఖంగా ఉండే సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ ఇరుగుపొరుగు వాసులు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్‌ఖాన్‌ తన కుటుంబ సభ్యులతో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు చిన్నది కావడం, స్థలాభావంతో శునకాల పెంపకం, గృహోపకరణాల హంగులు సమకూర్చుకొనేందుకు స్థలం లేకపోవడంతో కొంతకాలంగా ఆయన కొత్త ఇంటికోసం అన్వేషణ ప్రారంభించారు.

    ఈ నేపథ్యంలో బాంద్రా బ్యాండ్‌ స్టాండ్‌లోని షారుక్‌ ఇల్లు 'మన్నత్‌'కు సమీపంలోనే సల్మాన్‌ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం సల్మాన్‌ కొనుగోలు చేసిన 'సాగర్‌ రేషమ్‌' బిల్డింగ్‌ షారుక్‌ ఇంటికి రెండిళ్ల దూరంలో ఉంది.

    ఈ ఇల్లు ఒక గుజరాతీ కుటుంబానికి చెందినది కాగా ఆ ఇంటిని సల్మాన్‌ రూ.100 కోట్లతో సొంతం చేసుకున్నట్లు ప్రచారం. సల్మాన్‌ ఆ ఇంటికి రెండు, మూడు పర్యాయాలు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారని, ఇందుకు సంబంధించిన ఒప్పంద వ్యవహారాలు పూర్తయినట్లేనని విశ్వసనీయ సమాచారం.

    English summary
    According to reports, Salman Khan is moving to a new home which is very close from his arch enemy Shah Rukh Khan's residence - Mannat in Bandra Bandstand, Mumbai. While most actors and actresses in Bollywood live out of palatial homes, Salman Khan preferred to stay with his parents in Mumbai. However, looks like Salman Khan is finally all set to move out as rumours suggest that he is on the lookout for a new address. Interestingly, this new home seems to be very close from his arch enemy Shah Rukh Khan's Bandra Bandstand residence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X