39 కోట్లుతో ముంబైలో ప్లాట్ కొన్న మాస్ హీరో

By Srikanya

బాలీవుడ్ మాస్ హీరో,కండల వీరుడు ఇప్పుడు ప్రతీ విషయంలోనూ షారూఖ్ తో పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే సల్మాన్ తాజాగా ఓ ట్రిపులెక్స్ ప్లాట్ ని కొనుగోలు చేసాడు. అదీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఇంటి ప్రక్కనే కావటం విశేషం. వివరాల్లోకి వెళితే.. కింగ్‌ఖాన్ షారూఖ్ ముంబై బాంద్రాలోని మన్నత్ బంగ్లాలో ఉంటున్నారు. అయితే ఆ బంగ్లా పక్కనే ఉన్న 'ది అడ్రస్' భవనంలో సల్మాన్‌ఖాన్ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 28 అంతస్తులున్న ఈ బంగ్లాలో రూ. 39 కోట్లు వెచ్చించి సల్మాన్ ఓ ట్రిపులెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్ తండ్రి సలీంఖాన్ రూ.1.64 కోట్లు స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు చెప్పారు.

సల్మాన్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఫ్లాట్ ఉండడం గమనార్హం. కత్రినాకైఫ్ విషయంలో గొడవపడి వైరం పెంచుకున్న వీరిద్దరు అన్నింటా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అదే పట్టుదలతో సల్మాన్‌ఖాన్ ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏక్ ధా టైగర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X