twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ హీరో బ్యాగులో ఆడవారి బట్టలు, కొంపతీసి...!?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల తన బ్యాగులో ఆడవారి బట్టలు క్యారీ చేసి తను షాకవ్వడమే కాదు, అందరినీ షాక్ కు గురి చేసాడు. ఈ విషయం తెలిసిన వారంతా...ఏవేవో ఊహించుకున్నారు. కానీ అసలు విషయం తెలియడంతో నవ్వుకున్నారు. మరి ఆ సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ మ్యాటర్ చదవాల్సిందే.

    ఇటీవల అందిన వివరాల ప్రకారం... ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్ తన బ్యాగులో ఆడవాళ్ల దుస్తులు దర్శనం ఇచ్చాయి. అయితే ఓ చిన్న తప్పిదం వల్లనే ఆయన బ్యాగులో ఆడవారి బట్టలు దర్శనం ఇచ్చాయి. ఇటీవల సల్మాన్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ముంబై నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అయితే విమానం దిగన తర్వాత తన సహ ప్రయాణికురాలి బ్యాగు, సల్మాన్ ఖాన్ బ్యాగు తారుమారయ్యాయి.

    వీరిద్దరి బాగ్యులు ఒకే విధంగా ఉండటం, కన్వేయర్ బెల్ట్ మీద ఇద్దరి బ్యాగులు వెనకవెనకనే రావడంతో ఈ మిస్టేక్ జరిగింది. వెంటనే సల్మాన్ బాడీ గార్డ్స్, అసిస్టెంట్ వెంటనే ఆ బ్యాగును ఆమెకు ఇచ్చే సల్మాన్ బ్యాగ్ తీసుకొచ్చారు. సల్మాన్ బ్యాగ్ అంత ఆషామాషీగా తిరిగి రాలేదు. ఈ విషయం గమనించే లోగా సదరు మహిళ ఎయిర్ పోయిట్ నుంచి బయటకు వెళ్లింది. వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమె కాంటాక్ట్ నెంబర్ దొరకపట్టి ఆమెను కాంటాక్టు చేసి వెనక్కి రప్పించారట.

    సల్మాన్ ఇటీవల తన తాజా సినిమా 'దబాంగ్ 2' ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దబాంగ్ 2 సినిమా విషయానికొస్తే... సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈచిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు. డిసెంబర్ 21న ఈచిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన సోనాక్షి హీరోయిన్ గా నటిస్తుండగా..... కరీనా కపూర్, మలైకా అరోరా, సంజయ్ దత్ స్పెషల్ సాంగుల్లో దర్శనం ఇవ్వనున్నారు.

    English summary
    According to the recent reports, superstar Salman Khan was spotted carrying woman's clothes in his bag at the airport. But, there's nothing to get shocked about as it was just a minor case of bag exchange.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X